Homeటాప్ స్టోరీస్మహేష్ బావ పై ప్రశంసల వర్షం

మహేష్ బావ పై ప్రశంసల వర్షం

positive reports on sudheer babu sammohanamసినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే పలువురు ప్రముఖులు హీరో సుధీర్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . తాజాగా ఈ హీరో నటించిన చిత్రం ” సమ్మోహనం ” . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై రూపొందిన సమ్మోహనం చిత్రం సినిమా రంగం నేపథ్యంలో తెరకెక్కింది . సుధీర్ బాబు సరసన హాట్ భామ అదితిరావు హైదరి నటించింది ఇక కీలక పాత్రలో సీనియర్ నరేష్ నటించాడు . కాగా సమ్మోహనం చిత్రాన్ని చూసిన పలువురు సినీరంగ ప్రముఖులు సుధీర్ బాబు నటనకు ముగ్దులయ్యారు .

సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం సామాన్య విషయం కాదని అలాంటి అద్భుత నటనని ప్రదర్శించి మమ్మల్ని ఆశ్చర్యపరిచాడని అంటున్నాడు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి . అసలు సుధీర్ బాబు ఇంత అద్భుతంగా చేస్తాడని అస్సలు అనుకోలేదు నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా చేసాడు అంటూ పొగడ్తలు కురిపించాడు . అలాగే హీరోయిన్ అదితిరావు హైదరీ కూడా సుధీర్ బాబు ని ఆకాశానికి ఎత్తేసింది . సుధీర్ తో అంతగా పరిచయం లేదు నాకు , కానీ ఈ సినిమా సమయంలో షూటింగ్ గ్యాప్ లో చాలా సైలెంట్ గా ఉండేవాడు షాట్ రెడీ అనగానే పాత్రలో లీనమై పోయేవాడు , అతడి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యాను అంటూ మహేష్ బాబు బావ సుధీర్ బాబుని మెచ్చుకుంటోంది . చిత్ర బృందం మాత్రమే కాకుండా ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు సైతం మహేష్ బావ ని పొగుడుతున్నారు . ఇక ఈ సినిమా జూన్ 15న విడుదల అవుతోంది .

- Advertisement -

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts