
బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ నిషా ఎక్కించే తన అందాలతో సంచలనం సృష్టించింది పూనమ్ పాండే. హాట్ నెస్‌కి కెరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పూనమ్ అవకాశాలు తలుపు తట్టకపోవడంతో సెమీ పోర్న్ స్టార్‌గా మారిపోయి తనే సొంతంగా ఓ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకుని వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో కుంపట్లు రాజేసింది. సోషల్ మీడియాలో పూనమ్ గత కొంత కాలంగా రచ్చ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంత కాలంగా తనతో కలిసి వుంటున్న సామ్ బాంబేని ప్రేమించి పెళ్లి చేసుకుని షాకిచ్చింది పూనమ్. పదిహేను రోజుల క్రితమే వీరి వివాహం జరిగింది. జామ్ జామ్ అంటూ ఈ కొత్త జంట ఫొటోలకి పోజులిచ్చారు కూడా. అయితే సరిగ్గా పదిహేను రోజులు తిరక్కుండానే పూనమ్ తన భర్త సామ్ బాంబేపై కేసు ఫైల్ చేయడం సంచలనంగా మారింది.
ఓ మూవీ కోసం భర్త సామ్ బాంబేతో కలిసి గోవా వెళ్లిన పూనమ్ ఉన్నట్టుండి తన భర్త తనని వేధిస్తున్నారంటూ గోవాలోని కెనాకొనా పోలీసులకి కంప్లైంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో సామ్ బాంబేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను దారుణంగా వేధింపులకు గురిచేయడంతో పూనమ్‌కు వైద్య పరీక్షలు చేయించారట. ప్రస్తుతం ఈ టాప్‌క్ వైరల్‌గా మారింది.