Homeటాప్ స్టోరీస్స్టార్ డైరెక్ట‌ర్‌పై పూనమ్ మ‌ళ్లీ సంచ‌ల‌న ట్వీట్‌!

స్టార్ డైరెక్ట‌ర్‌పై పూనమ్ మ‌ళ్లీ సంచ‌ల‌న ట్వీట్‌!

స్టార్ డైరెక్ట‌ర్‌పై పూనమ్ మ‌ళ్లీ సంచ‌ల‌న ట్వీట్‌!
స్టార్ డైరెక్ట‌ర్‌పై పూనమ్ మ‌ళ్లీ సంచ‌ల‌న ట్వీట్‌!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మృతి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లోనూ ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. నెపోటిజ‌మ్ కార‌ణంగానే సుశాంత్ మృతి చెందాడంటూ బాలీవుడ్‌పై నెటిజ‌న్స్  దుమ్మెత్తిపోస్తున్నారు. బాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై విరుచుకుప‌డుతూ అన్ ఫాలో ఉద్య‌మాన్ని మొదలు పెట్టారు. ఇదిలా వుంటే టాలీవుడ్‌లోనూ దాని ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.

న‌టి పూన‌మ్ కౌర్ గ‌త కొంత కాలంగా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్‌పై న‌ర్మ‌గ‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ హంగామా చేస్తోంది. సుశాంత్ మ‌ర‌ణం త‌రువాత డైరెక్ట్‌గా త‌న‌ని ఇబ్బంది పెట్టిన వారిపై ట్వీట్ లు చేస్తూ పూన‌మ్ కౌర్ టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఓ స్టార్ డైరెక్టర్ త‌ను డిప్రెష‌న్‌లో వున్నానంటే అవ‌హేళ‌న‌గా మాట్లాడాడ‌ని, నువ్వు చ‌నిపోతే ఒక్క‌రోజు న్యూస్ అవుతావంటూ ఎగ‌తాళి చేశాడ‌ని, అత‌న్ని అంతా గురూజీ అంటార‌ని, అత‌ను గురూజీ కానే కాద‌ని హింట్ ఇచ్చేసింది.

- Advertisement -

తాజాగా అదే ద‌ర్శ‌కుడిపై సంచ‌ల‌న ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌తొ పాటు ఆ వ్య‌క్తి త‌న స్నేహితుడిని కూడా ఇబ్బందుల పాలు చేశాడ‌ని విమ‌ర్శించిన పూన‌మ్ `నువ్వు త‌న‌కు ఎంతో న‌చ్చిన త‌న భార్య ద‌గ్గ‌ర‌కు తిరిగి వెళ్ల‌కుండా చేశావు. ఆమె త‌న భ‌ర్త‌ను ఎంత‌గానో ప్రేమించేది. ఇప్పుడు ఆమె ఎన్నో విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటోంది. దానికి నువ్వే కార‌ణం. నువ్వు చేసిన ప‌నికి ఇప్పుడు వాళ్ల పిల్ల‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. నువ్వు ఈ ప‌ని ఎందుకు చేశావ్‌?. స్టో పాయిజ‌న్ లా అత‌న్ని చంపాల‌నుకున్నావా? అని ప్ర‌శ్నించ‌డం టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All