
పూనమ్ కౌర్..సినిమాలకన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. నిత్యం వివాదాస్పద కామెంట్స్ , పోస్టులు చేస్తూ ఉండే ఈమె..తాజా ఇద్దరు పిల్లలతో ఉన్న పిక్ పోస్ట్ చేసి..మరోసారి వార్తల్లో హైలైట్ అయ్యింది. హ్యాపీ నెస్ అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోని పంచుకుంది పూనమ్. అయితే ఆ కిడ్స్ ఎవరనేది అమ్మడు మెన్షన్ చేయలేదు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పిల్లలు ఎవరో చెపుతుందో లేదో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘మాయాజాలం’ తర్వాత పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించింది కానీ.. ఇవేవీ పూనమ్ కౌర్ కు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. సరైన ఆఫర్స్ లేక గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్.. ఇటీవల ‘నాతి చరామి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.