Homeటాప్ స్టోరీస్మరో “హాసిని” లెవల్ లో “బుట్టబొమ్మ” క్యారెక్టర్

మరో “హాసిని” లెవల్ లో “బుట్టబొమ్మ” క్యారెక్టర్

మరో “హాసిని” లెవల్ లో “బుట్టబొమ్మ” క్యారెక్టర్
మరో “హాసిని” లెవల్ లో “బుట్టబొమ్మ” క్యారెక్టర్

2006 లో బొమ్మరిల్లు అనే సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ అయిన హాసిని అనే క్యారెక్టర్ అప్పటి అమ్మాయిల పై ఎంతగా ప్రభావం చూపించింది అంటే, అప్పట్లో దాదాపు ఒక 2 ఏళ్ళ వరకూ 10th,ఇంటర్,డిగ్రీ, బి.టెక్ అమ్మాయిలు అందరూ తమ సొంత బెహేవియర్ లు వదిలేసి హాసిని లాగా మాట్లాడటం, ప్రవర్తించడం చేసారు. ఇక ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా, టిక్ టాక్ లాంటి రచ్చ అప్పుడు లేకపోవడం మన అదృష్టం. ఆ తర్వాత మళ్ళీ బొమ్మరిల్లు భాస్కర్ గారు తన సినిమాలైన “ఆరెంజ్”, “పరుగు”, “ఒంగోలు గిత్త” సినిమాల్లో మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్ ను అంత బలంగా చూపించలేదు. అందులో హీరోయిన్స్ క్యారెక్టర్స్ సగటు “టాలీవుడ్ తింగరబుచ్చి” లాగే ఉంటాయి. మళ్ళీ “ఎందుకంటే ప్రేమంట” సినిమాలో తమన్నా క్యారెక్టర్ ఇందుకు మినహాయింపు.

ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాగార్జున గారి బ్లెస్సింగ్ తో అఖిల్ బాబు హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ గారు “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్” అనే సినిమా తీస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ లో సైడ్ లుక్ తో ఉన్న అఖిల్ బాబు ను చూపించారు. కాళ్ళకు షూస్ లేకుండా నడుస్తున్న అఖిల్ ఫస్ట్ స్టెప్ కు కొనసాగింపుగా, పూజా హేగ్దే లుక్ రివీల్ చేసారు. పూజా హేగ్దే అందం గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఇక పూజా క్యారెక్టర్ పేరు ఇందులో “విభా” అని తెలుస్తోంది. రెండు చేతుల్లో అఖిల్ షూస్ పట్టుకుని, మైక్ ముందు ఫోజ్ ఇచ్చిన పూజా పోస్టర్ అదిరిపోయింది. ఇక బన్నీ వాసు & వాసు వర్మనిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ గారు స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల అవుతోంది. ఏదీ ఏమైనా పూజా క్యారెక్టర్ అంచనాలకు తగ్గకుండా ఉంటె అదే చాలు. ఒకవేళ భాస్కర్ గారి క్రియేటివిటీ మనకు కనెక్ట్ అవ్వకపోయినా బుట్టబొమ్మ కు ఉన్న డైహార్డ్ ఫ్యాన్స్ సప్పోర్ట్ ఉంది కాబట్టి నష్టం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All