Homeటాప్ స్టోరీస్చరణ్ తో తైతక్కలాడుతున్న పూజా హెగ్డే

చరణ్ తో తైతక్కలాడుతున్న పూజా హెగ్డే

రాంచరణ్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే , కాగా ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికాగా బ్యాలెన్స్ గా ఉన్న ఐటెం సాంగ్ ని తాజాగా చిత్రీకరిస్తున్నారు . కుర్రకారు కి ఊపొచ్చేలా ఉండే ఈ పాటలో చరణ్ తో తైతక్కలాడటానికి పూజా హెగ్డే ని ఎంపిక చేసిన విషయం కూడా విదితమే . ప్రస్తుతం ఈ ఇద్దరితో పాటు పలువురు డ్యాన్సర్ లపై ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు , ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు .

సుకుమార్ చిత్రాలకు ఆస్థాన విద్వాంసుడు దేవిశ్రీ ప్రసాద్ , పైగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ ఆడియో కూడా సూపర్ హిట్ అయ్యింది దాంతో రంగస్థలం పై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి . చరణ్ సరసన సమంత నటించిన ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ కూడా నటించింది . ఇక ఈ చిత్రాన్ని మార్చి 30న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీస్ అధినేతలు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All