
పూజా హగ్దే..ఈ పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ బ్యూటీ..అల్లు అర్జున్ సరసన డీజే మూవీ లో నటించి తన జాతకాన్ని మార్చుకుంది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టడం..అవన్నీ సూపర్ హిట్ కావడం తో అమ్మడు బిజీ అయ్యింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. అయితే పూజాహెగ్డేకు మాత్రం ఒకటే కోరిక ఉందట.. ఎన్నేళ్లు గడిచినా ఆ కోరికలో ఎలాంటి మార్పు ఉండదంటోంది. ఇంతకీ ఆ కోరిక ఏంటి అంటే..
మహిళల కోసం ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది. ఎందుకంటే, అమ్మాయిలకు కావాల్సినంత కంటెంట్ లేదని నా అభిప్రాయం. మహిళా లోకానికి ఇప్పటివరకు నేను ప్రాతినిధ్యం వహించలేదనిపిస్తోంది. తెరపై ఏదైనా చూసినప్పుడు మనం కూడా అలా మారిపోవాలని కోరుకుంటాం. అదే స్థానంలో ఓ బలమైన మహిళ ఉంటే అది మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే అమ్మాయిల్ని ఉత్తేజపరిచే సినిమాల్ని ఎక్కువగా చేయాలని ఉంది. ఇలా మహిళలు, మరీ ముఖ్యంగా యంగ్ అమ్మాయిల కోసం సినిమాలు చేయాలనే కోరికను బయటపెట్టింది పూజా హెగ్డే. తనకు ఇంకా చాలా కెరీర్ ఉందని, కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా యంగ్ గర్ల్స్ కు స్ఫూర్తినిచ్చే సినిమాలు చేస్తానని ప్రకటించింది. ఈమె కోరిక తెలిసి అంత శభాష్ అంటున్నారు.