Homeటాప్ స్టోరీస్వర్మ 'లడ్కీ' పోజ్..చూడాలంటే చాల కిందికి వెళ్లాల్సిందే

వర్మ ‘లడ్కీ’ పోజ్..చూడాలంటే చాల కిందికి వెళ్లాల్సిందే

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి సినిమా వస్తుందంటే అది వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. కేవలం పబ్లిసిటీ తోనే సినిమాకు ఎంత బజ్ తీసుకురావాలో అంత తీసుకొస్తారు. ప్రస్తుతం వర్మ కొండా మూవీ తో పాటు ‘లడ్కీ’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ లో హీరోయిన్ పూజా భలేకర్ లీడ్ రోల్ పోషించింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేసిన వర్మ.. చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

- Advertisement -

ఇందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూజా భలేకర్ వర్కవుట్ వీడియో వదిలి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక అంతటితో ఆగక మై లడ్కీ అంటూ వరుసపెట్టి పూజా భలేకర్ హాట్ స్టిల్స్ వదిలారు. ఈ స్టిల్స్ చూసిన నెటిజన్లు.. కెమెరా యాంగిల్స్ మామూలుగా లేవనే కామెంట్స్ పెడుతున్నారు. ఆర్ట్‌సి మీడియా, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లడ్కీ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్‌లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రానికి నివాళిగా తెరకెక్కించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All