Homeటాప్ స్టోరీస్మరో వారసురాలు హీరోయిన్ గా వస్తోంది

మరో వారసురాలు హీరోయిన్ గా వస్తోంది

Pooja bedi daughter aalia furniturewalla debut bollywoodఫిల్మ్ ఇండస్ట్రీ లో తమ వారసులను హీరోలుగా పరిచయం చేయడం కామన్ అయితే గతకొంత కాలంగా దానికి భిన్నంగా తమ కూతుర్ల ని కూడా హీరోయిన్ లుగా పరిచయం చేస్తున్నారు . టాలీవుడ్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది కాగా బాలీవుడ్ లో అయితే ఎప్పటి నుండో ఆ వారసత్వం కొనసాగుతోంది . తాజాగా హాట్ భామ పూజా బేడి తన కూతురు అలియా ఫర్నీచర్ వాలా ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి రంగం సిద్దం చేసింది . బాలీవుడ్ లో 90 వ దశకంలో హాట్ హీరోయిన్ గా , వ్యాంప్ పాత్రలతో హీటేక్కించిన భామ పూజా బేడి . బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రెండు చిత్రాల్లో నటించింది ఈ భామ . అందులో మోహన్ బాబు హీరోగా నటించిన చిట్టెమ్మ మొగుడు చిత్రంలో నటించింది .

కట్ చేస్తే ఇప్పుడు తన కూతురు ఆలియా ఫర్నీచర్ వాలా ని హీరోయిన్ గా పరిచయం చేయనుంది . సైఫ్ అలీఖాన్ హీరోగా నటించనున్న ” జవానీ జానేమన్ ” అనే చిత్రం తో ఆలియా ఫర్నీచర్ వాలా పరిచయం కానుంది . ఆలియా ఫర్నీచర్ వాలా ని చూస్తుంటే తల్లి కంటే ఈ పిల్లే ఎక్కువగా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఉంది . ఆలియా మంచి అందగత్తె కావడంతో హీరోయిన్ గా సత్తా చాటే చాన్స్ ఎక్కువగా ఉందని ,పిల్ల లుక్స్ బాగున్నాయని అంటున్నారు ఆలియా ఫర్నీచర్ వాలా ని చూసిన వాళ్ళు .

- Advertisement -

English Title: Pooja bedi daughter aalia furniturewalla debut bollywood

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All