Homeటాప్ స్టోరీస్జనసేన ఆవిర్భావ సభ పర్మిషన్ ఇచ్చిన ఏపీ పోలీసులు

జనసేన ఆవిర్భావ సభ పర్మిషన్ ఇచ్చిన ఏపీ పోలీసులు

police green signal to janasena avirbhava sabha
police green signal to janasena avirbhava sabha

ఎట్టకేలకు జనసేన ఆవిర్భావ సభ కు పోలీసుల నుండి పర్మిషన్ రావడం తో కార్య కర్తలు రెట్టింపు ఉత్సహంతో పనిచేస్తున్నారు. ఈరోజు బుధువారం మధ్యాహ్నం వరకు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం తో పెద్ద ఎత్తున మీడియా లో వార్తలు ప్రచారం అయ్యాయి. కావాలనే ప్రభుత్వం పవన్ సభ కు పర్మిషన్ ఇవ్వడం లేదనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ రాత్రి సభ కు పర్మిషన్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన భావించింది. అందుకోసం గ్రామానికి చెందిన ప‌లువురు రైతులతో మాట్లాడి వారి భూముల్లోనే వేడుక‌లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు అనుమతి నిస్తూ పోలీసులు ఉత్త‌ర్వులు జారీచేశారు. ఇదిలా ఉంటే.. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. మరి ఈ సభ లో పవన్ ఏమాట్లాడతాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All