Homeటాప్ స్టోరీస్యాంకర్ రవి పై కేసు నమోదు

యాంకర్ రవి పై కేసు నమోదు

Police case on anchor Raviబుల్లితెర యాంకర్ రవి పై పోలీసులు కేసు నమోదు చేసారు . సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్ ని కొట్టడమే కాకుండా కొంతమందిని తీసుకొచ్చి బెదిరించిన కేసులో రవి పై కేసు నమోదు అయ్యింది . బుల్లితెర ఐ యాంకర్ గా రాణిస్తున్న రవి విపరీతంగా సంపాదిస్తున్నాడు . బయటి కార్యక్రమాలతో పాటుగా టివి కార్యక్రమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు . అలాగే మంచి డిమాండ్ ఉండటంతో బాగానే సంపాదిస్తున్నాడు . అలా వచ్చిన సొమ్ములో కొంత సందీప్ కి ఇచ్చాడు అయితే సందీప్ సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో తన స్నేహితులను తీసుకొని అతడి పై దాడికి పాల్పడ్డాడు దాంతో సందీప్ పోలీసులను ఆశ్రయించాడు .

టివి షోలలో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు యాంకర్ రవి . ఇక ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు . ఆ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు ప్రేక్షకులకు . రవిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి ని పిలిచి విచారణ చేసారు . అయితే అతడ్ని అరెస్ట్ చేయకుండా రవిని పంపించారు . మళ్ళీ అవసరమైతే పిలుస్తామని అప్పుడు విచారణకు మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పారట పోలీసులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All