Homeటాప్ స్టోరీస్వాహనదారులు షాకింగ్ వార్త వినబోతున్నారా..?

వాహనదారులు షాకింగ్ వార్త వినబోతున్నారా..?

Petrol, diesel prices could shoot up by Rs 15 per litre this week
Petrol, diesel prices could shoot up by Rs 15 per litre this week

గత రెండు , మూడు నెలలుగా పెట్రోల్ ధరలు పెరగకుండా ఉండేసరికి హమ్మయ్య అనుకుంటూవస్తున్నారు. కానీ ఆ మూడు నెలలదంతా ఒకేసారి రాబట్టేందుకు చమురు సంస్థలు సిద్దమైనట్లు తెలుస్తుంది. లీటర్ కు ఒకటి , రెండు రూపాయిలు కాదు ఏకంగా రూ. 15 వరకు పెరగబోతున్నట్లు వినికిడి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో క్రూడాయిల్ రోజురోజుకు ఎగబాకుతోంది. కాకపోతే మనదగ్గర మాత్రం పెట్రోల్ ధరలు పెరగకుండా ఉన్నాయి. దీనికి కారణం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నడవడమే.

ఇక నిన్నటి తో ఎన్నికలు పోలింగ్ ముగియడం తో ఇక పెట్రోల్ ధరలు పెంచుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అంత చెపుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఏకంగా 125 డాలర్లకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఇంధన రిటైలర్లకు బ్రేక్ ఈవెన్ కావాలంటే దేశీయంగా లీటర్‌ పెట్రోలుపై సుమారు రూ.15, డీజిల్‌పై రూ.22 పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. నిజంగా ఈ రేంజ్ లో పెరిగితే సామాన్యుల ఫై పెనుభారం పడనుంది. ఇప్పటికే పెట్రోల్ , డీజిల్ ధరల కారణంగా నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చుంటే..ఇప్పుడు పెట్రోల్ ధరలు భారీగా పెరిగితే ప్రతి దానిపై రేటు పెరుగుతుంది. ఇది సామాన్యులకు పేరును భారం కావడం ఖాయం.

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉండగా.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.21 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.33గా ఉంది. ఇక పెరిగితే ఇంకెలా ఉంటాయో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All