
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. రీసెంట్ గా విడుదలైన కళావతి సాంగ్ ట్యూబ్ లో అనేక రికార్డ్స్ బ్రేక్ చేయగా..ఆదివారం చిత్రంలోని రెండో సాంగ్ పెన్నీ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. ప్రస్తుతం 10 మిలియన్ వ్యూస్ , 500K లైక్స్ తో వార్తల్లో నిలిచింది. ఈ పాట ద్వారా తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార పాప.
ఇక ఈ మూవీ పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.