Homeటాప్ స్టోరీస్పెళ్లిచూపులు డైరెక్టర్ తో వెంకటేష్

పెళ్లిచూపులు డైరెక్టర్ తో వెంకటేష్

పెళ్లిచూపులు చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పెళ్లిచూపులు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లోనే మూడు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు దాస్యం తరుణ్ భాస్కర్. అందులో భాగంగానే ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా తీసాడు. కానీ అది ప్లాప్ అయ్యింది.

- Advertisement -

 

దాంతో కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈ యువ దర్శకుడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడట. కథ ok అయ్యింది అయితే పక్కాగా స్క్రిప్ట్ వచ్చాక మాత్రమే మరోసారి చూసుకొని అప్పుడు సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. ప్రస్తుతం దాస్యం తరుణ్ భాస్కర్ పక్కా స్క్రిప్ట్ రూపొందించే పనిలో ఉన్నాడు. తన రెండో సినిమా దెబ్బకొట్టడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పెళ్లికాని ప్రసాద్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వినోద ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All