Homeటాప్ స్టోరీస్రియాలిటీ కి దగ్గరగా ఉండే 'పెళ్లిరోజు'

రియాలిటీ కి దగ్గరగా ఉండే ‘పెళ్లిరోజు’

Pelli roju movie reviewఓరు నాల్ కూతు‘ పేరుతో తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతూ  విజయవంతంగా కొనసాగుతోంది. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్  తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘పెళ్లిరోజు‘ అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో సినీ యోగ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రవీణ్ కందికట్టు సమర్పణలో మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి నిర్మించారు. దినేష్, నివేత పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ లు నటించిన ఈ     చిత్రాన్ని నేడు (డిసెంబర్ 8న) విడుదల చేశారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో సమీక్ష లోనికి వెళ్లి తెలుసుకుందాం..

కథ:
ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్లను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రమే ‘పెళ్లి రోజు’. ఒక్కో అమ్మాయి తాను పెళ్లి పీటలు ఎక్కాలని తపనతో ఉన్నప్పుడు  సరిగ్గా అదే సమయంలో ఆ ముగ్గురి జీవితాల్లో ఒక్కొక్కరికీ ఎదురయ్యే  ఆటంకాలను తెలుపుతూ చివరికి ఎలా ముగిసింది వారి పెళ్లి తంతు అనేదే మెయిన్ కాన్సెప్ట్. వీరిలో ఒక అమ్మయి కావ్య (నివేత పేతు రాజు) తన కొలీగ్ (రాజ్) దినేష్ ను ప్రేమిస్తుంది.. పెళ్లి చేసుకోవాలకున్న సమయంలో కావ్య ఫాదర్,  పేదవాడైన రాజ్ ను అంగీకరించక కావ్యకు వేరే సంబంధం చూస్తాడు. తప్పని పరిస్థితిలో ఆ పెళ్లిని అంగీకరిస్తుంది కావ్య. ఆ పెళ్లి జరిగే సమయానికి పెళ్ళికొడుకు తండ్రి చనిపోతాడు. అమ్మాయి దురదృష్టురాలని పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు కావ్య పెళ్లి ఎవరితో జరిగిందనేదే ఆమె అంకం. ఇక రెండో అమ్మాయి లక్ష్మి (మియా జార్జ్) ఆమెకు తగ్గ వరుడు కోసం ప్రతి సారీ పెళ్లి చూపులను జరిపిస్తుంటాడు ఆమె తండ్రి. తండ్రి చాటు పెరిగిన అమ్మాయి కావడంతో ఎదిరించలేక తానూ కూడా పెళ్లి చూపులకు సిద్దపడుతూనే ఉంటుంది. ఒక రోజు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి లక్ష్మి అమితంగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఆ పెళ్లి అనివార్య కారణాల వల్ల  ఆగిపోతుంది.  ఇక మూడో అమ్మయి పెళ్లి సంసారంపై ఆశలున్న సుశీల (రిత్విక) రేడియో జాకీ గా పని చేస్తుంటుంది. కానీ వచ్చిన సంబంధాల్నీ వెనక్కి పోతుంటాయి. ఈ క్రమంలోనే ఓ సంబంధం ఖాయం అవుతుంది. మొదట ఆ పెళ్ళికి ఒకే చెప్పినా తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని సుశీలకు చెబుతాడు పెళ్ళికొడుకు భాస్కర్. షాక్ తిన్న సుశీల ఎలాగైనా భాస్కర్ ను పెళ్లి కు ఒప్పించమని ఆమె అన్నయ్యకు చెప్పి ఓ ప్రోగ్రామ్ పని మీద బెంగుళూరు వెళ్ళిపోతుంది.  పట్టు పట్టడంతో భాస్కర్ పెళ్ళికి అంగీకరిస్తాడు కానీ ఈసారి సుశీల పెళ్లిచేసుకోనని చెబుతుంది. ఇలా వారి వారి పెళ్లి సమయాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి..? ఆ ముగ్గురు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారన్నదే పెళ్లి రోజు క్లైమాక్స్.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..  కబాలి చిత్రం లో రజనీకాంత్ బాడీగార్డ్ పాత్ర తో  మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ ఈ చిత్రం లో రాజ్ పాత్రను చేసి మెప్పించాడు.  ‘మెంటల్ మదిలో’ చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేత పేతురాజ్ కావ్య పాత్రలో అక్కట్టుకుంది.  సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’ లో నటించిన మియా జార్జ్ లక్ష్మి అందంగా అమాయకంగా అలరించింది.  తమిళ ‘బిగ్ బాస్ 2’ విజేత రిత్విక సుశీల పాత్రలో ఒదిగిపోయింది. ఇలా ఎవరికీ వారు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో కథే హీరో. కనుక ఎవరికీ వారు పాత్రల్లో మెచ్యూరిటీని కనబరిచారు.

ఇక సాంకేతిక వర్గ విషయానికి వస్తే: డైరెక్టర్  నెల్సన్ వెంకటేశన్  యూనివర్సల్ కాన్సెప్ట్ ను తెరకెక్కించాడని చెప్పొచ్చు.. చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది కథా కథనం.. మన పక్కింటి వాళ్ళ జీవితాలను చూసి రాసుకున్నాడా అనిపించేలా తీర్చిదిద్దాడు వారి పాత్రలను. రెలిస్టిక్ కథను ఎంచుకోవడమే కాకుండా అత్యంత రియలిస్టిక్ గా ప్రెసెంట్ చేసి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.. ఎవరి కథ ఎలా మలుపు తిరుగుతుందో క్లైమాక్స్ లో అద్భుతంగా చూపించాడు. అమ్మాయిలు వారికున్న సహనాన్ని కన్నులకు కట్టినట్టుగా, అర్థవంతగా చూపించి దర్శకత్వాన్ని మెచ్చుకునేలా చేసాడు.  ఎడిటింగ్ వర్క్ బాగుంది..

తమిళం లో ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన జస్టిన్ ప్రభాకరన్ సంగీతం తెలుగు లో కూడా శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘చిలకా  చిలకా’ పాట యువత ని బాగా ఆకట్టుకుంటుంది.  సోషల్ మీడియా సెన్సేషన్ పల్లె కోయిల ‘పసల బేబి’ ఈ పాటను పాపడటం విశేషం. ఈ చిత్రానికి  అందించిన మల్లూరి వెంకట్ మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక డబ్బింగ్ సినిమాని చూస్తున్నట్లుగా కాకుండా ఒక తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలిగేలా జాగ్రత్తలు తీసుకుని అనువదించారు నిర్మాతలు మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి మరియు సహ నిర్మాత వినయ్. ఇక పెళ్లి రోజు గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే..  నేటి యువతీ యువకుల మనస్తత్వాలకు, భావాలకు అద్దం పట్టేటట్టుగా చిత్రీకరించారు అని చెప్పొచ్చు.

రేటింగ్: 3.5/5

English Title:  Pelli roju movie review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All