Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్పెళ్ళిచూపులు అట్టర్ ఫ్లాప్ అయ్యింది

పెళ్ళిచూపులు అట్టర్ ఫ్లాప్ అయ్యింది

Pellichupulu flop on small screenవెండితెర మీద దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్ళిచూపులు చిత్రం సంచలన విజయం సాధించడంతో అదే పేరుతో ప్రదీప్ అనే యాంకర్ స్టార్ మా లో పెళ్ళిచూపులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . 14 మంది అమ్మాయిలతో ప్రదీప్ కి పెళ్ళిచూపులు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ నుండే తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంది . పెళ్ళి కావాల్సిన 14 మంది అమ్మాయిల చేత రకరకాల మాటలు అనిపిస్తూ ప్రోగ్రాం చండాలంగా సాగడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యింది . బిగ్ బాస్ లా ఈ షోని రక్తి కట్టించాలని చూసారు కానీ మొదటికే మోసం వచ్చింది .

- Advertisement -

మొదట్లో విమర్శలు వచ్చాయి కదా ! తర్వాతి ఎపిసోడ్ లోనైనా బెటర్ అవుతుందేమో అనుకుంటే ఎక్కడ కూడా మెరుగు కాకపోగా మరింతగా విమర్శల పాలయ్యింది , ఇక రాను రాను ఆ షో ని చూసేవాళ్ళ సంఖ్య కూడా తగ్గింది దాంతో పెళ్ళిచూపులు షో కి అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది . యాంకర్ గా ప్రదీప్ కూడా ఫెయిలయ్యాడు , ఇక మరో విచిత్రం ఏంటంటే …… సుమ కూడా అట్టర్ ఫ్లాప్ షోలో భాగస్వామి కావడం . సదరు చానల్ వాళ్ళు ఈ షో పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఆశలన్ని అడియాసలయ్యాయి .

English Title: Pelli Choopulu flop on small screen

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts