Homeటాప్ స్టోరీస్శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం

Pellante Movie Openingశ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`…? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో త‌రుణ్ క్లాప్ నివ్వ‌గా, రాజేంద్ర కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏంజెల్ ప్రొడ‌క్ష‌న్స్, మ‌ద‌ర్ అండ్ ఫాద‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై అలీ భాయ్ నిర్మిస్తున్నారు. మోయిన్ k.Md ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అనంత‌రం జ‌రిగిన మీడియా స‌మావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ` చాలా కాలం త‌ర్వాత కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నా. నాకు ప‌క్కాగా యాప్ట్ అయిన స‌బ్జెక్ట్ ఇది. అలీ క‌థ బాగుంది చేయి? అని డైరెక్ట‌ర్ ను నా ద‌గ్గ‌ర‌కు పంపిచాడు. క‌థ విన‌గానే వెంట‌నే ఒకే చేసా. మంచి ఎట‌ర్ టైన‌ర్. న‌వ‌ర‌సాలు క‌థ‌లో ఉన్నాయి. మోయిన్ చాలా సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసారు. ఆ అనుభ‌వంతో క‌థ‌ను బాగా రాసుకున్నాడు. సినిమా కూడా బాగా తీస్తార‌ని న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.

- Advertisement -

న‌టుడు అలీ మాట్లాడుతూ, ` మోయిన్ చాలా కాలం నుంచి తెలుసు.మంచి విజన్ వున్న దర్శకుడు.ఇక మంచి సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసిన రాజేంద్ర కుమార్ `క్షేమంగా వెళ్లి లాభంగా రండి` సినిమాకు రైట‌ర్. ఇలా చాలా సినిమాల‌కు ర‌చ‌న చేసారు. ఇప్పుడు అయన కధ అందించిన ఈ సినిమా స‌క్సెస్ సాధించి అందిరికీ మంచి పేరు తీసుకొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మోయిన్ k.Md మాట్లాడుతూ, `క‌థ ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ ఎంట‌ర్ టైనింగ్ గా సాగుతుంది. `పెళ్లి సంద‌డి`, `పెళ్లాం ఊరెళితే`త‌ర‌హాలో సాగే క‌థ‌. సినిమా అంతా సంద‌డి సంద‌డిగా హాయిగా సాగిపోతుంది. కొన్ని స‌న్నివేశాలు క‌న్నీళ్ల‌ను పెట్టిస్తాయి. చాలా కాలం త‌ర్వాత శ్రీకాంత్ గారిని ఇలాంటి క‌థ‌లో చూపిస్తే బాగుంటుంద‌న్న ఉద్దేశంతో ఈ ప్ర‌యత్నం చేస్తున్నాను. అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా. జూన్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ వెళ్తాం. షూటింగ్ బ్యాంకాక్ లో జ‌రుగుతుంది` అని అన్నారు.

హీరోయిన్ల‌ల‌లో ఒక‌రైన శాలు చౌరిశియ మాట్లాడుతూ, ` ట్రెడీష‌న‌ల్ గాళ్ల్ పాత్ర‌లో క‌నిపిస్తా. శ్రీకాంత్ గారితో క‌లిసి న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా. అది ఇప్ప‌టికి కుదిరింది. మంచి స‌బ్జెక్ట్. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ బాగా న‌చ్చుతుంది` అని అన్నారు.

నిర్మాత అలీ భాయ్ మాట్లాడుతూ,`మంచి క‌థ‌. చ‌క్క‌ని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. థియేట‌ర్లో సినిమా చూస్తున్నంత సేపు న‌వ్వులు పువ్వులే. జూన్ నుంచి షూటింగ్ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. షూటింగ్ ఎక్కువ భాగం బ్యాంకాక్ లో సాగుతోంది. అక్క‌డ అంద‌మైన లోకేష‌న్ల‌ల‌లో షూట్ చేస్తాం. అన్ని ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.

మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ సినిమాలో అవ‌కాశం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేసారు. ఇందులో అలీ , రాజేంద్ర కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: జి.కె, సంగీతం : మోయిన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఒలీఖాన్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్: ఏజెల్ ప్రొడ‌క్ష‌న్స్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All