Homeటాప్ స్టోరీస్సీనియర్ హీరోలతో రొమాన్స్ కి సై అంటున్న పాయల్

సీనియర్ హీరోలతో రొమాన్స్ కి సై అంటున్న పాయల్

 Payal rajput ready to romance with old heroesసీనియర్ హీరోలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్ . ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి అయితే వస్తున్న సినిమాలన్నీ ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చేస్తోంది . ఇప్పటికే కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్న ఈ భామ తాజాగా సీనియర్ హీరోలు అయిన నాగార్జున , వెంకటేష్ లతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .

 

- Advertisement -

నాగార్జున హీరోగా మన్మధుడు 2 చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే కాగా ఆ చిత్రంలో నాగార్జున రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంది పాయల్ , ఇక తాజాగా మరో సీనియర్ హీరో వెంకటేష్ సరసన కూడా నటించడానికి ఒప్పుకుంది . వెంకీ మామ అనే చిత్రంలో వెంకటేష్ తో రొమాన్స్ చేయనుంది పాయల్ రాజ్ పుత్ . మొత్తానికి కుర్ర హీరోలతో మాత్రమే కాకుండా సీనియర్ హీరోలతో కూడా రొమాన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తోంది అన్నమాట పాయల్ రాజ్ పుత్ .

English Title: Payal rajput ready to romance with old heroes

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All