Homeటాప్ స్టోరీస్పాయల్ కు ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ వచ్చేసిందిట

పాయల్ కు ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ వచ్చేసిందిట

పాయల్ కు ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ వచ్చేసిందిట
పాయల్ కు ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ వచ్చేసిందిట

ఏ హీరోయిన్ అయినా కలలు కనే డెబ్యూ ఆరెక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు దొరికింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించడమే కాదు ఓ రేంజ్ లో పాయల్ కు ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోను పూర్తిగా డామినేట్ చేసి ఆమె లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఆ సినిమా రిలీజైన సమయంలో అందరూ ఈ హీరోయిన్ గురించే చర్చ. బోల్డ్ గా కనిపిస్తూ లిప్ లాకులను కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా పెట్టేసిన పాయల్ కు యూత్ లో బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. అయితే సక్సెస్ సాధించడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం అంటుంటారు. పాయల్ ను చూస్తే అది నిజంగా నిజమనే ఫీలింగ్ వస్తుంది.

ఆరెక్స్ 100తో వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవడంలో ఈ భామ విఫలమైంది. ఎలాంటి సినిమాలు చేయాలో తెలీక బూతు కంటెంట్ ఉన్న ఆర్డీఎక్స్ లవ్ వంటి సినిమాలపై నమ్మకముంచింది. అయితే అవి విజయం సాధించక పోగా పాయల్ కెరీర్ ను మరింత కిందకు తోసాయి. దీంతో ఈ భామ కెరీర్ ఇక ముగిసినట్లే అని భావిస్తోన్న తరుణంలో పాయల్ కు మరో అవకాశం వెంకీ మామ రూపంలో వచ్చింది. వెంకటేష్ సరసన వెంకీ మామలో నటించింది పాయల్. ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకునే దిశగా వెళ్తోంది. రెండో వారంలో నాలుగు సినిమాలు విడుదలైనా దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడంతో అది వెంకీ మామకు బాగా కలిసొచ్చింది. రెండో వారంలో కూడా కలెక్షన్స్ బాగున్నాయి.

- Advertisement -

ఇందులో పాయల్ క్యారెక్టర్ హైలైట్ ఏం కాదు. పెద్దగా చెప్పుకోదగ్గ పాత్ర కూడా కాదు. అయితే నెగటివిటీ మాత్రం తీసుకురాలేదు ఈ పాత్ర. పైగా సీనియర్ హీరోల సరసన సరిపోతుంది అన్న పేరు వచ్చింది. సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్ల కొరత ఎంత ఉందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పాయల్ కనుక బెస్ట్ ఛాయస్ కాగలిగితే ఆమె కెరీర్ మరో రెండు, మూడేళ్లు తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. వెంకీ మామ తర్వాత పాయల్ డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఈ చిత్రంపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది కూడా హిట్ అయితే మళ్ళీ తనకు అవకాశాలు పెరుగుతాయని ధీమాగా ఉంది.

ఇప్పుడు తనకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలిసిందని, వచ్చిన అవకాశాల్ని పోగొట్టుకొనని అంటోంది పాయల్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All