Homeటాప్ స్టోరీస్పుష్పలో స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన పాయల్

పుష్పలో స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన పాయల్

పుష్పలో స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన పాయల్
పుష్పలో స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన పాయల్

ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పై  గత కొన్ని రోజులుగా రూమర్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పుష్ప సినిమాలో పాయల్ ను స్పెషల్ నెంబర్ కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. గతంలో సీత సినిమాలో పాయల్ స్పెషల్ నెంబర్ చేసి ఉండడంతో ఈ వార్త నిజమేనని అనుకున్నారంతా. దీంతో పాటు కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రంలో కూడా పాయల్ స్పెషల్ నెంబర్ చేస్తుందని అంటున్నారు.

అయితే ఈ రూమర్లకు పాయల్ చెక్ పెట్టేసింది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ పాయల్ ఈ రూమర్లను కొట్టిపారేసింది. తనపై వస్తున్నవన్నీ రూమర్లేనని, తనను అసలు ఏ స్పెషల్ నెంబర్ కోసం సంప్రదించలేదని, తనకు కూడా అలాంటి పాటలు చేయడానికి ఆసక్తి లేదని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం తాను ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనట్లేదని తెలిపింది. అయితే తనకు కెరీర్ విషయంలో ఎలాంటి కంగారు లేదని, తనకోసం మంచి సినిమాలు వస్తాయని, ప్రస్తుతం లాక్ డౌన్ లో స్క్రిప్ట్స్ వింటున్నానని, అన్ని విషయాలకు త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలిపింది పాయల్.

- Advertisement -

పాయల్ రాజ్ పుత్ సినిమాలు ఏంజెల్, నరేంద్ర ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All