
ఆరెక్స్ 100 వంటి బోల్డ్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో హీరో, హీరోయిన్ ఇద్దరికీ ఫుల్ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా పాయల్ ఆ రోల్ లో చేసిన బోల్డ్ షో కు చాలా మందే ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఆ తర్వాత నుండి కెరీర్ ను సరిగ్గా నిర్మించుకోవడంలో ఈ భామ విఫలమైంది. మరో బోల్డ్ స్టోరీ అనుకుంటూ చేసిన ఆర్డీఎక్స్ లవ్ పూర్తిగా బెడిసికొట్టింది. రవితేజ సరసన చేసిన డిస్కో రాజా వల్ల కూడా ఒరిగిందేమి లేదు.
మరోవైపు ఐటెం సాంగ్స్ అంటూ తన మీద ఉన్న బోల్డ్ ముద్రను ఇంకా బలపరుచుకుంది. ఈ నేపథ్యంలో పాయల్ కు అన్నీ అలాంటి అవకాశాలే రావడం మొదలయ్యాయి. ఇదిలా ఉంటె పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన ఫాలోయర్స్ కు ట్రీట్ ఇస్తూ వస్తుంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై బట్టలు లేకుండా కనిపించింది. అంతేకాదు, ఒక క్లాత్ మాత్రమే చుట్టుకున్నట్లుగా కనిపించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ గా మారాయి.