Homeటాప్ స్టోరీస్అశ్వద్ధామలో పవన్ డైలాగ్ ఇదే!

అశ్వద్ధామలో పవన్ డైలాగ్ ఇదే!

అశ్వద్ధామలో పవన్ డైలాగ్ ఇదే!
అశ్వద్ధామలో పవన్ డైలాగ్ ఇదే!

నాగ శౌర్య నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ అశ్వద్ధామ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ ఒక యాక్షన్ థ్రిల్లర్ ను చూడబోతున్నామనే ఫీల్ ను కలిగించాయి. ఈ చిత్రంపై శౌర్య మొదటి నుండి సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇటీవలే మీడియాతో కలిసి నాగ శౌర్య ఈ చిత్రం గురించి చాలా విశేషాలనే పంచుకున్నాడు. ఈ సినిమాలో విలన్ ను మొదటినుండి చూపించలేదు. దీనిపై శౌర్య స్పందించాడు. అది కావాలనే దాచామని, ఇందులో విలన్ గా చేసిన ఆయన ఒక బెంగాలీ నటుడని, ఇతణ్ణి చూసి అందరూ షాక్ అవ్వాలని, ఆ షాక్ ఫ్యాక్టర్ కోసమే దాచి ఉంచామని తెలిపాడు.

ఇంకా మాట్లాడుతూ ఈ చిత్రం గోపాల గోపాల లోని పవన్ కళ్యాణ్ డైలాగ్ తో మొదలవుతుందిట. ఇందుకోసం పవన్, శరత్ మరార్ పెర్మిషన్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు శౌర్య. గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో కనిపించిన సంగతి తెల్సిందే. అందులో అశ్వద్ధామ గురించి ప్రస్తావన వస్తుంది. “నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది చూస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకుని కొట్టకుండా చూస్తూ ఉండిపోయిన ప్రతి ఒక్కరూ చావాల్సిందే భీష్ముడితో సహా.. అశ్వద్ధామ ఒక్కడే ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు.. బ్రతికిపోయాడు. ఇదే ధర్మం, ధర్మం ఇలాగే ఉంటుంది” అన్న డైలాగ్ గోపాల గోపాలలో ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఈ డైలాగ్ తోనే సినిమాను మొదలుపెడుతున్నారు.

- Advertisement -

అన్యాయం జరుగుతుంటే తప్పని ప్రతిఘటించిన ప్రతి ఒక్కరూ అశ్వద్దాములే అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమాలో జరిగిన ఆ తప్పేంటి? తప్పని చెప్పిన అశ్వద్ధామ, తప్పు చేసిన వాళ్ళను ఎలా శిక్షించాడు వంటివి చాలా ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రరాక్షసుడు, ఖైదీ, ఖాకి సినిమాల తరహా ట్రీట్మెంట్ ఉంటుందని నాగ శౌర్య చెప్పుకొచ్చాడు. రమణతేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయిక.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All