
పరిటాల రవి తో నాకు ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేసాడు పవన్ కళ్యాణ్ . గతంలో పవన్ కళ్యాణ్ పై దాడులు జరిగాయని దానికి పరిటాల రవి కారకుడని అప్పట్లో సంచలన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిటాల ఇంటిని సందర్శించడం సంచలనం సృష్టిస్తోంది . కదిరి నరసింహుడిని దర్శించుకొని అనంతపురం పర్యటన ని ముగించనున్నాడు పవన్ . వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ తో జట్టు కట్టమంటే అలాగే చేస్తానని కానీ అది ఎన్నికల ముందు మాత్రమే స్పష్టత వస్తుందని తెలిపాడు పవన్ . ఈ సమావేశంలో మంత్రి పరిటాల సునీత కూడా పాల్గొన్నారు .
- Advertisement -