Homeగాసిప్స్పవన్ ఆ సినిమాను చేయట్లేదట

పవన్ ఆ సినిమాను చేయట్లేదట

పవన్ ఆ సినిమాను చేయట్లేదట
పవన్ ఆ సినిమాను చేయట్లేదట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. రీ ఎంట్రీలో వరసగా సినిమాలను సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్. తన కెరీర్ లో ఎప్పుడూ ఒక సినిమా పూర్తయ్యాకనే మరో సినిమాను ఒప్పుకునే పవన్. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలను ఒప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో 15 రోజులు షూటింగ్ పూర్తి చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లిపోవచ్చు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనా కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే సాధ్యమైంది. తర్వాత లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లను నిలిపివేశారు. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను కూడా చేయనున్నాడు పవన్ కళ్యాణ్.

గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ పట్ల అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది చివరికల్లా పూర్తయిపోతాయి. అయితే పవన్ 2022లో కూడా సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో దర్శక నిర్మాతలు ముందుగా సినిమాను కమిట్ చేయించి వెయిట్ చేయొచ్చులే అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపాల గోపాల సినిమాను తెరకెక్కించిన డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో ఫోన్ లోనే లైన్ చెప్పి డాలీ సినిమాను ఓకే చేయించుకున్నాడని అన్నారు. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలోనే ఉన్నాడట. అవి పూర్తయ్యాకే తర్వాత ఏం చేయాలన్న నిర్ణయం తీసుకుంటాడని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All