Homeగాసిప్స్ఆచార్య ప్రీ రిలీజ్ గెస్ట్ లు ఎవరో తెలుసా..?

ఆచార్య ప్రీ రిలీజ్ గెస్ట్ లు ఎవరో తెలుసా..?

pawan-ktr at acharya pre release event
pawan-ktr at acharya pre release event

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ట్రైలర్ ను ఏప్రిల్ 12 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపి అభిమానుల్లో సంతోషం నింపారు. అలాగే అన్ని థియేటర్స్ లలో ఈ ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారట.

అలాగే ఈ చిత్ర ప్రీ రిలీజ్ తాలూకా న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ లను ఆహ్వానించారట.

- Advertisement -

ఈ ఈవెంట్ కోసమై అనుమతులను తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇచ్చినట్లు టాక్. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట. ఇక ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిరంజన్రెడ్డి- అన్వేష్రెడ్డి నిర్మిస్తున్నారు. సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, బెనర్జీ కీలక పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All