Friday, December 9, 2022
Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ సైరా లో ఎప్పుడొస్తారంటే...

పవన్ కళ్యాణ్ సైరా లో ఎప్పుడొస్తారంటే…

Pawan Kalyan Voiceover in Syeraa
పవన్ కళ్యాణ్ సైరా లో ఎప్పుడొస్తారంటే…

‘పవన్ కళ్యాణ్’ సినిమా నటుడు మాత్రమే కాదు. నలుగురికి స్ఫూర్తిదాత, నలుగురి మార్పు కోరుకునే, నలుగురి బాగు కోరుకునే వారు. అందుకే ఆయనకీ సినిమా పరంగా తక్కువ అయినా వ్యక్తిగతంగా చూసుకుంటే అభిమానులు ఎక్కువ.

- Advertisement -

అయితే సినిమాలకి మళ్ళి రావాలి అని చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దర్శక , నిర్మాతలు కూడా అందుకు పెద్దగా పధకాలు వేస్తున్నారు అని విన్నాం. అయితే అది ఎప్పుడు జరుగుతుందో ఏమో గాని, అక్టోబర్ 02 వ తేదీన విడుదల అవుతున్న చిరంజీవి గారి సినిమా “సైరా నరసింహా రెడ్డి” సినిమాలో తన స్వరం వినపడుతుంది అని విన్నాం, ట్రైలర్ లో చూసాం కూడా. అయితే మరి పవన్ కళ్యాణ్ గారి స్వరం సినిమాలో సినిమా లో మొదట వినపడుతుందా? లేక చివరలో వినపడుతుందా? లేదా ఒక్కొక్కరిని పరిచయం చేసే క్రమంలో తన స్వరాన్ని మనం వినగలమా? అన్నది ప్రతి పవన్ అభిమాని మదిలో నిలిచే ప్రశ్న.

అయితే సినిమాలో నరసింహా రెడ్డి క్యారెక్టర్ గా చిరంజీవి గారిని ఉరితీసిన తర్వాత, నరసింహా రెడ్డి తలని కోయిల‌కుంట్ల కోట గుమ్మానికి బ్రిటీష్‌వారు వేలాడదీస్తారు..ఉయ్యాల‌వాడ పోరాటం ఇత‌రుల్లో ఎలా స్ఫూర్తి నింపింద‌నే స‌న్నివేశాల‌ను 15 నిమిషాలు పాటు చిత్రీక‌రించార‌ట‌. ఆ క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో పవన్ కళ్యాణ్ స్వరం ఉంటుంద‌ట‌.

మొత్తానికి సినిమా దగ్గర పడుతున్న తరుణంలో పవన్ అభిమానులకి ఇలా అయినా తమ అభిమాన నటుడిని తెర మీద చూడలేకపోతున్న, కనీసం స్వరం విన్న చాలు అదొక తృప్తి అని భావిస్తున్నారు. మొత్తానికి మెగా అభిమానులకే కాకుండా సినిమా ప్రియులకి ఇదొక తీపి కబురు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts