
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ రిహార్సలో బిజీ బిజీ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడగ..రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో మొదలుపెట్టుకోబోతుంది. ఈ సెట్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ రిహార్సల్ లో బిజీ బిజీ గా ఉన్నారు. వాటి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడం తో వైరల్ గా మారాయి.
వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
Powerstar @PawanKalyan rehearsing for a high voltage, full-throttle action sequence for #HariHaraVeeraMallu with Todor Lazarov @Juji79@dirkrish @AMRathnamOfl @MegaSuryaProd @HHVMfilm pic.twitter.com/ar04jj3bDY
— BA Raju's Team (@baraju_SuperHit) April 7, 2022