
సాయి ధరం తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్పీచ్ తో ఫ్యాన్స్ ను అలరించారు. ముఖ్యంగా వైసిపి నేతలను సన్నాసులు.. వెధవలు అంటూ జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపారు. సినిమా పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అవసరమైతే నా సినిమాల్ని ఆపేసుకోండి అన్నారు. సన్నాసులు, వెధవలు అంటూ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.
సినిమా హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కోట్లు తీసుకోవడం మీద సన్నాసులు పడి ఏడుస్తున్నారని.. ప్రభాస్ కండలు పెంచితేనే బాహుబలి సినిమా వచ్చిందని అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్.టి.ఆర్ డ్యాన్సులు వేస్తాడు కాబట్టి నిర్మాత డబ్బులు ఇస్తారు. రాం చరణ్ గుర్రపు స్వారి చేస్తాడు కాబట్టి డబ్బులు ఇస్తారు. ఫైట్లు, డ్యాన్సులు వేస్తూ కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని కష్టపడితేనే డబ్బులు వస్తాయని అన్నారు పవన్ కళ్యాణ్.
అంతేకాదు మాకు వచ్చే కోట్ల రెమ్యునరేషన్ లో చాలా భాగం ట్యాక్సుల రూపంలోనే ఖర్చు అవుతాయని అన్నారు. మేమేమీ రాజకీయ నాయకుల్లా దోచుకోవడం లేదు.. కాంట్రాక్టులు చేయడం లేదని అన్నారు పవన్ కళ్యాణ్. సినీ పరిశ్రమ విలువ 2 వేల కోట్లు ఉంటుందేమో.. వాళ్లది లక్ష కోట్ల రేంజ్.. అందుకే పరిశ్రమని తొక్కేయాలని అనుకుంటారని విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. సినిమా పరిశ్రమ జోలికి వస్తే ఊరుకునేది లేదని. మోహన్ బాబు సహా సినీ పరిశ్రమ ప్రముఖులంగా ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడాలని అన్నారు.
తెలుగు సినిమాల్ని ఆంధ్రప్రదేష్ లో ఆపేస్తే.. అక్కడ ప్రభుత్వ పెద్దలు.. థియేటర్లలో \ఓ అరగంట చాలు\ అనే సినిమాలు తీసుకుని ప్రదర్శించుకోవచ్చంటూ వైసీపీ నేత ఆడియో టేపుల లీకుల అంశాన్ని కూడా ప్రస్తావించి వైసీపీ నాయకులపై సెటైర్ వేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఇష్టమొచ్చినట్టు చేయడానికి వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్. తన సినిమాలు ఆపేసినా పర్లేదు కాని సినీ పరిశ్రమకు మంచి చేయాలని చెప్పారు పవన్. మొత్తానికి రిపబ్లిక్ ఈవెంట్ కాస్త పొలిటికల్ కామెంట్స్ తో హీటెక్కేలా చేశారు పవన్ కళ్యాణ్.