Homeటాప్ స్టోరీస్మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండగా పవన్ సంచలన ట్వీట్

మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండగా పవన్ సంచలన ట్వీట్

pawan kalyan latest tweet

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఏపీలో భీమ్లా నాయక్ రిలీజ్ గందరగోళం గా మారింది. జీవో 35 రద్దయినప్పటికీ రెవిన్యూ అధికారులు థియేటర్స్ లలో తనిఖీలు చేయడం, బెనిఫిట్ షోస్ కు అనుమతి లేదని చెప్పడం , స్నాక్స్ ధరల ఫై ఆంక్షలు విధించడం వంటివి చేస్తున్నారు. ఇదే అనుకుంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. థియేటర్స్ దగ్గరికి వెళ్తే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలని చెప్పడం..ఆన్లైన్ లో టికెట్స్ కనిపించకపోవడం తో అభిమానులు అయోమయం అవుతున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ప్రముఖ జర్మన్ వేదాంతి పాస్టర్ మార్టిన్ నిమొల్లర్ తెలిపిన మాటలను పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

‘మొదట వారు సోషలిస్టులు కోసం వచ్చారు. అప్పుడు నేను సోషలిస్టు కాదు కాబట్టి మాట్లాడలేదు, ఆ తర్వాత వారు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కాబట్టి మాట్లాడలేదు, ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూదుడిని కాదు కాబట్టి. చిట్టచివరికి వారు నాకోసం వచ్చారు. అప్పుడు నాకోసం మాట్లాడటానికి ఎవరూ లేరు.’ అని మార్టిన్ నిమొల్లర్ మాటలను, ఫోటోను ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

ఈ ట్వీట్ బట్టి పవన్ ఉద్దేశ్యం తన సినిమాకు తలెత్తిన సమస్య తర్వాత మిగతావారికి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పకనే చెప్పినట్లు అర్ధమవుతుంది. మరి దీనిని ఇతర సినిమాల నిర్మాతలు గ్రహించి భీమ్లా నాయక్ కు సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి. మరోపక్క తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ సైతం జగన్ సర్కార్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ‘భీమ్లానాయక్‌’ విడుదల కానున్న నేపథ్యంలో రద్దు అయిన జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయించాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి ప్రసన్నకుమార్‌, నిర్మాత నట్టి కుమార్‌ అన్నారు. శుక్రవారం ‘భీమ్లానాయక్‌’ విడుదలవుతుండటంతో బుధవారం నుంచే ఎమ్మార్వోలు, ఆర్దీవోలు, జాయింట్‌ కలెక్టర్‌లు థియేటర్ల వారిని టార్చెర్‌ పెడుతున్నారు. రూ.5, 10, 15, 20 చొప్పున టిక్కెట్లు అమ్మాలని లేకుంటే కేసులు పెడతామని అధికారులు వత్తిడి తీసుకొస్తున్నారు. ఇది కంటెంప్ట్‌ అఫ్‌ కోర్టు కిందకు వస్తుందని అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఏపీ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం అందరూ కలసి కదం తొక్కారు. కానీ అదే మీరు మా థియేటర్‌ల వద్దకు వచ్చి, హైకోర్టు సస్పెండ్‌ చేసిన జీవో 35 రేట్లకు టిక్కెట్ల రేట్లు అమ్మమని బెదిరింపులకు పాల్పడటం శోచనీయం. థియేటర్ల వారు ట్యాక్స్‌ సరిగా కట్టకపోవడం, బ్లాక్‌లో అధిక ధరలకు టికెట్లు అమ్మకం జరిపితే అలాంటి థియేటర్లపై చర్యలు తీసుకుంటే తప్పు లేదు. కానీ ఇలా వేధించడం కరెక్ట్‌ కాదు అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All