
హమ్మయ్య వీరమల్లు సెట్ లో అడుగుపెట్టాడు..హరిహర వీరమల్లు యూనిట్ ఊపిరి పీల్చుకున్న క్షణం ఇది. క్రిష్ – పవన్ కళ్యాణ్ కలయికలో హరిహర వీరమల్లు చిత్రాన్ని గ్రాండ్ గా మొదలైతే పెట్టారు..కానీ పూర్తి చేయడం మాత్రం అంత ఈజీ కాలేకపోయింది. కరోనా మహమ్మారి వల్ల కొన్ని నెలలు షూటింగ్ ఆగిపోతే, పవన్ కళ్యాణ్ వల్ల మరికొన్ని నెలలలు ఆగిపోయింది. ఇక ఎట్టకేలకు ఈరోజు రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో మొదలైంది.
సెట్ లో వీరమల్లు గెటప్ లో పవన్ దర్శనమిచ్చారు. అంతే కాకుండా పద్మశ్రీ తోట తరణి ప్రత్యేకంగా తన నిర్దేశకత్వంలో రూపొందించన భారీ సెట్ లలో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ సందర్బంగా పద్మశ్రీ తోట తరణిని ప్రత్యేకంగా హీరో పవన్ కల్యాణ్ పుష్ప గుచ్చాన్ని అందించి ఆత్మీయంగా సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. మరి ఈ షూటింగ్ సజావుగా సాగుతుందో..లేక మళ్లీ బ్రేక్ పడుతుందా అనేది చూడాలి.
#HariHaraVeeraMallu shri @PawanKalyan garu felicitates the Legendary Art Director Padma Shri #ThotaTharani garu who is giving immense life to the sets as the shoot of @HHVMFilm resumes today ?@DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 pic.twitter.com/OF2DAFqpGN
— BA Raju's Team (@baraju_SuperHit) April 8, 2022