Homeటాప్ స్టోరీస్బన్నీ, తేజ్ లకు పవర్ స్టార్ శుభాకాంక్షలు

బన్నీ, తేజ్ లకు పవర్ స్టార్ శుభాకాంక్షలు

బన్నీ, తేజ్ లకు పవర్ స్టార్ శుభాకాంక్షలు
బన్నీ, తేజ్ లకు పవర్ స్టార్ శుభాకాంక్షలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడేమో కానీ సినిమా వాళ్లకు మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నా అది ఎప్పుడన్నది మాత్రం ఇంకా తెలియలేదు. పింక్ రీమేక్ లో నటిస్తాడనుకున్న పవన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. మరోవైపు దిల్ రాజు అండ్ కో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి పనిచేయనున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేసేసారు. ఈ నెలాఖరుకి కానీ వచ్చే నెల మొదట్లో కానీ సినిమా మొదలవుతుందని అంటున్నారు కానీ దానిపై ఎటువంటి క్లారిటీ లేదు.

మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలను క్లోజ్ గా ఫాలో అవుతున్నట్లున్నాడు. మరీ ముఖ్యంగా తన ఫ్యామిలీ వాళ్ళ సినిమాలు. గతంలో చిత్రలహరి విజయం సాధించిన సందర్భంలో ఫ్లవర్ బొకే పంపించిన పవన్ కళ్యాణ్, రీసెంట్ గా వచ్చి హిట్ కొట్టిన ప్రతిరోజూ పండగే చిత్ర విజయానికి కూడా అభినందించాడు. “సాయి ధరమ్ తేజ్ గారికి శుభాకాంక్షలు, మీ ప్రతిరోజూ పండగే చిత్రం విజయం సాధించిన సందర్భంగా నా శుభాభినందనలు” అని అర్ధం వచ్చేలా ఒక నోట్ పై రాసి ఫ్లవర్ బొకే పంపించారు. అలాగే ప్రతిరోజూ పండగే దర్శకుడు మారుతికి కూడా ఈ విధమైన శుభాకాంక్షలు తెలియజేసాడు.

- Advertisement -

ఇక రీసెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన అల వైకుంఠపురములో విషయంలో కూడా పవన్ ఈ విధంగా స్పందించారు. అల్లు అర్జున్ కు, నిర్మాత చినబాబుకు ఈ విధమైన గ్రీటింగ్స్ ను అందజేశాడు. అటు తేజ్ కానీ, ఇటు అల్లు అర్జున్ కానీ, మారుతి కానీ, హారిక అండ్ హాసిని సంస్థ కానీ ఈ గ్రీటింగ్స్ కు పొంగిపోయారు. ప్రతిగా థాంక్స్ చెబుతూ వారు సోషల్ మీడియాలో స్పందించారు.

ఇలా పవన్ కళ్యాణ్ అందరికీ శుభాకాంక్షలు తెలపడంతో పవర్ స్టార్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరోవైపు తన రీ ఎంట్రీ గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All