Homeఎక్స్ క్లూసివ్అలీని తిడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

అలీని తిడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Pawan kalyan fans fires on ali
Ali

కమెడియన్ అలీ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తిడుతున్నారు . అలీ ని మాత్రమే కాదు అతడి మతాన్ని సైతం తిడుతూ పోస్ట్ లు పెడుతూండటం పెద్ద వివాదానికి దారి తీసేలా ఉంది . పవన్ కళ్యాణ్ కు బాగా ఇష్టమున్న హాస్య నటులలో అలీ దే అగ్రస్థానం . ఎందుకంటే ఈ విషయాన్నీ చాలాసార్లు పవన్ కళ్యాణ్  చెప్పాడు కూడా . అలీ నా సినిమాలో ఉండాల్సిందే అని పట్టుబట్టి మరీ పెడుతుంటాడు పవన్ కళ్యాణ్ ,అయితే అంతటి అనుబంధం ఉన్న అలీ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ?

ఇటీవలే ప్రతిపక్ష నేత జగన్ ని కలిసాడు అలీ , దాదాపు గంటసేపు ఇద్దరూ చర్చించుకున్నారు దాంతో అలీ జగన్ పార్టీలోకి చేరబోతున్నాడు అంటూ ఊహాగానాలు చెలరేగాయి . జనసేన పార్టీలో చేరతాడేమో అనుకుంటే జగన్ తో మంతనాలు ఏంటి ? అని పవన్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది అంతే ! అలీ ని , అతడి మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలు పెట్టారు . ఈ విషయం అలీ ద్రుష్టి కి రావడంతో చాలా బాధపడ్డాడట . ఇక అలీ యువసేన ఇలాంటి పోస్ట్ లు మంచి పద్దతి కాదంటూ జనసేన కార్యకర్తలకు , పవన్ అభిమానులకు వార్నింగ్ ఇస్తున్నారు .

- Advertisement -

English Title: Pawan kalyan fans fires on ali

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All