Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

Pawan kalyan fan died in nandyal public meetingజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని నంద్యాల లో చనిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది . ఆంధ్రప్రదేశ్ లో శాసనసభతో పాటుగా పార్లమెంట్ కు కూడా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే . దాంతో అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి . ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా నంద్యాల లో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు , భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసాడు .

 

- Advertisement -

కాగా పవన్ కళ్యాణ్ ని చూడాలని అతడి మాటలు వినాలని భావించిన సిరాజ్ అనే అభిమాని ఏకంగా మైక్ సెట్ కోసం ఏర్పాటు చేసిన రాడ్ లపై కూర్చున్నాడు . అయితే ఎండా వేడి ఎక్కువ కావడంతో పాటుగా ఒక్కసారిగా అందరు తోసుకోవడంతో మైక్ సెట్ ల కోసం ఏర్పాటు చేసిన రాడ్ లు కూలిపోయాయి . దాంతో పైన ఉన్న సిరాజ్ కిందపడి చనిపోయాడు . సగటు మనిషి సిరాజ్ , ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సిరాజ్ చనిపోవడంతో ఆ కుటుంబలో విషాద ఛాయలు నెలకొన్నాయి .

English Title : Pawan kalyan fan died in nandyal public meeting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All