Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించడట

పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించడట

Pawan kalyan denied rumoursపవన్ కళ్యాణ్ ఇకపై సినిమాల్లో నటించడట !ఆమేరకు ఓ పత్రికా ప్రకటన జారీ చేసాడు . పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు అంటూ కథనాలు వచ్చాయి దాంతో ఈ ఖండన ప్రకటన జారీ చేసాడు . ఇకనుండి నా జీవితమంతా రాజకీయాలకే అంకితం , ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్ . జనసేన తరుపున ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున తిరుగుతున్నాడు పవన్ . ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రం పవన్ కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు . దాంతో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తాం అంటూ ప్రకటించేశాడు పవన్ .

అజ్ఞాతవాసి చిత్రం ఘోర పరాజయం పొందడంతో మళ్ళీ పవన్ నటిస్తే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు కానీ పవన్ మాత్రం సినిమాల పట్ల ఆసక్తి ప్రదర్శించడం లేదు . ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు నెలల కాలంలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఇప్పటి నుండే ప్రజల్లో ఉండాలని భావిస్తున్నాడు . అయితే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తానని కళలు కంటున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో 5 నుండి 10 సీట్లు వస్తే గొప్ప అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .

- Advertisement -

English Title: Pawan kalyan denied rumours

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All