Homeగాసిప్స్పవన్ ట్వీట్ అర్ధం..నిహారిక వ్యవహారమేనా..?

పవన్ ట్వీట్ అర్ధం..నిహారిక వ్యవహారమేనా..?

pawan-fire to-niharika
pawan-fire to-niharika

శనివారం బంజారాహిల్స్ లోని ఫుడింగ్ మింక్ పబ్‌ ఫై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ,వ్యాపార రంగాలకు చెందినవారు దొరికారు. వీరిలో నాగబాబు కూతురు నిహారిక కూడా ఉండడం తో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో , మీడియా లో పలు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు..ఈ వ్యవహారం ఫై స్పందించారు. అయినప్పటికీ మాత్రం మెగా అభిమానులు కాస్త నిహారిక ఫై ఆగ్రహంగానే ఉన్నారు.

ఇదిలా ఉండగానే పవన్ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ మరింత వైరల్ గా మారింది. బీసీలు, ఎస్సీలు క‌లిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్‌మ‌నోహ‌ర్ లోహియా ఆలోచ‌న‌ల్ని పంచుకుంటూ ర‌చ‌యిత వాకాడ శ్రీ‌నివాస్ కోట్‌ను తాను ప్ర‌స్తావిస్తున్న‌ట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. “శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది… అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…” అని ట్వీట్ చేశారు.

- Advertisement -

ప్ర‌స్తుతం తెలుగు స‌మాజంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన ప్ర‌ముఖుల పిల్ల‌ల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపైన్నే ప‌వ‌న్ ట్వీట్ చేసిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా త‌న అన్న కుమార్తె నిహారిక పేరుపై ర‌చ్చ సాగుతుండ‌డంపై ప‌వ‌న్ త‌న అస‌హ‌నాన్ని ప‌రోక్షంగా వెల్ల‌డించిన‌ట్టు చెబుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధం ఇచ్చిన‌ట్టైంద‌ని ప‌వ‌న్ ట్వీట్ సారాంశంగా అంత మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి పబ్ లో నిహారిక అడ్డంగా దొరకడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All