
పరుచూరి వెంకటేశ్వరరావు పరిచయం చేయాల్సిన పేరు కాదు..పరుచూరి బ్రదర్స్ లలో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించడమే కాకుండా..ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి పరుచూరి వెంకటేశ్వరరావు కు సంబదించిన తాజా లుక్ అందర్నీ షాక్ లో పడేసింది. ఎలా ఉండేవారు..ఎలా అయిపోయాడేంటి..అసలు ఏమైంది అని ఆరాతీయడం మొదలుపెట్టారు. ఇదే తరుణంలో సోషల్ మీడియా లో పలు నెగిటివ్ వార్తలు సైతం వైరల్ అవ్వడం జరిగింది. దీంతో ఈ వార్తల ఫై గోపాల కృష్ణ క్లారిటీ ఇచ్చారు.
అన్నయ్య బాగానే ఉన్నాడు. కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు. ఆ తర్వాత ఆయన 10 కిలోలు తగ్గారు. ఈ రెండు సంవత్సరాలలో నేనూ 10 కిలోల బరువు తగ్గాను. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. ఆ ఫొటో షేర్ చేసిన జయంత్‌ను కూడా అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు, ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. చిక్కిపోయాడు, జుట్టుకు రంగేసుకోలేదని ఇలా చాలామంది అన్నారు. ఒక్క వ్యక్తి మాత్రం 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని కరెక్ట్‌గా చెప్పాడు. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు’ అని గోపాల కృష్ణ చెప్పుకొచ్చాడు.