Homeటాప్ స్టోరీస్పంతం రివ్యూ

పంతం రివ్యూ

Pantham Movie Reviewపంతం రివ్యూ :
నటీనటులు : గోపీచంద్ , మెహరీన్ కౌర్
సంగీతం : గోపిసుందర్
నిర్మాత : కేకే రాధామోహన్
దర్శకత్వం : చక్రవర్తి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 5 జూలై 2018

గోపీచంద్ హీరోగా నటించిన పంతం ఈరోజు విడుదల అయ్యింది . చక్రవర్తి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కేకే రాధామోహన్ నిర్మించిన ఈ పంతం తో గోపీచంద్ సక్సెస్ బాట పట్టాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే .

కథ :

- Advertisement -

రాజకీయ నాయకులంతా ఓ సిండికేట్ గా ఏర్పడి ప్రజలకు చేరాల్సిన సొమ్ము ని నొక్కేస్తుంటారు , ఈ సిండికేట్ ముఠా కు నాయకుడు హోం మినిస్టర్ నాయక్ (సంపత్ ). అయితే రాజకీయ నాయకుల ఇళ్ళల్లో చోరీలు చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తుంటాడు విక్రాంత్ ( గోపీచంద్ ). రాజకీయ నాయకుల తో పాటు వాళ్ళ లీడర్ అయిన హోం మినిస్టర్ కు కూడా టోకర వేస్తాడు విక్రాంత్ సురాన ,దాంతో అసలు విక్రాంత్ ఎవడు ? రాజకీయ నాయకుల్ని ఎందుకు టార్గెట్ చేసాడు ? అని తెలుసుకోవాలనుకుంటాడు హోం మినిస్టర్ ఆ సమయంలో అతడికి కళ్ళు చెదిరే వాస్తవాలు తెలుస్తాయి . అసలు విక్రాంత్ సురాన ఎవరు ? రాజకీయ నాయకులను ఎందుకు టార్గెట్ చేసాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కథ
గోపిచంద్ యాక్షన్
కోర్టు ఎపిసోడ్

డ్రా బ్యాక్స్ :

కొన్ని అనవసర సన్నివేశాలు
సంగీతం

నటీనటుల ప్రతిభ :

గోపీచంద్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడు , అలాగే మేకోవర్ లో కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు . యాక్షన్ తోనే కాకుండా హాస్యం తో కూడా అలరించాడు గోపీచంద్, ఇక కోర్టు సీన్ లో అయితే గోపీచంద్ నటన కు జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . కమెడియన్ లు పృథ్వీ , శ్రీనివాస రెడ్డి లు కూడా బాగా నవ్వించారు ముఖ్యం గా పృథ్వీ తో గోపీచంద్ పండించిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది . శ్రీనివాస్ రెడ్డి కూడా ఫరవాలేదని పించాడు . హీరోయిన్ మెహారిన్ కౌర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది ,కేవలం పాటలకు గ్లామర్ కు పరిమితమయ్యింది . విలన్ గా సంపత్ రాణించాడు . ఇతర పాత్రల్లో ముఖేష్ ఋషి , జయప్రకాశ్ , తనికెళ్ళ భరణి , షాయాజీ షిండే తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

గోపి సుందర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు ,పాటలు మైనస్ అయితే నేపథ్య సంగీతం తో అలరించాడు . ప్రసాద్ మూరెళ్ళ అందించిన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . ప్రతీ ఫ్రేం ని అందంగా , రిచ్ గా చిత్రీకరించాడు . రాధామోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక దర్శకుడు చక్రవర్తి విషయానికి వస్తే …… ….. ఓ సందేశానికి కమర్షియల్ అంశాలను జోడించి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు . గోపీచంద్ ని ఎలా చూపిస్తే బాగుంటుందో ఆ మార్క్ చూపించి , సందేశం తో తన ప్రతిభ నిరూపించుకున్నాడు .

 

ఓవరాల్ గా :

పంతం చిత్రాన్ని ఓసారి తప్పకుండా చూడొచ్చు

English Title: Pantham Movie Review

                               Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All