Homeటాప్ స్టోరీస్“మీ సినిమా మీరే చూడరా..!”- “పలాస” సినిమా వివాదం

“మీ సినిమా మీరే చూడరా..!”- “పలాస” సినిమా వివాదం

Palasa movie controversy
Palasa movie controversy

ఇప్పటివరకు సినిమా అంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని రెండు రకాలు ఉంటాయి అని అందరం అనుకునే వాళ్ళం. కానీ తమ స్వార్థం కోసం ప్రపంచాన్ని సమాజాన్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ముక్కలు చేసి పబ్బం గడుపుకునే ఒక బ్యాచ్ సినిమాల్లో కూడా అగ్రకుల సినిమా, దళిత సినిమా  అని వేరు చేసి మాట్లాడుతూ కళామతల్లి పరువు తీస్తున్నారు.

ప్రస్తుతం ఈ వివాదం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన “పలాస” అనే సినిమాతో మొదలైంది. ప్రేక్షకుల ఆదరణతో సంబంధం లేకుండా…  కరోనా వైరస్ వల్ల అన్ని సినిమాల కలెక్షన్స్ ప్రభావితం అయ్యాయి. ఎప్పుడూ.. సినిమాలు ఎక్కువగా ఆదరించే ప్రేక్షకులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కొంచెం సినిమాలు చూడటం తగ్గించారు. ఆ మాత్రం దానికి చిత్ర సమర్పకులలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక సభలో మాట్లాడుతూ…. “మీ గురించి తీసిన సినిమాలో… మీరు చూడకపోతే ఎలా.?”  అని వివాదాస్పదంగా మాట్లాడారు.

- Advertisement -

దానికి తోడు  సినిమా విశ్లేషకుడనని చెప్పుకొని తిరుగుతూ, సమాజంలో అనేక అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి కత్తి మహేష్ కూడా “పలాస” సినిమాని దళిత సినిమా… అని చెబుతూ, “మన జాతి పై తీసిన సినిమాని మనమే దగ్గరుండి చూసి హిట్ చేయాలి.? ఎంతకాలం ఇలా అగ్రకుల జాతులు తీసిన సినిమాలు చూస్తూ, వాటికి డబ్బులు కట్టబెడుతూ ఉంటారు.?” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సినిమా అనేది 24 విభాగాలు కలిస్తేనే పూర్తి అవుతుంది. ఒక విభాగానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు కొన్ని వందల మంది దాకా పని చేయాల్సి రావచ్చు. సినిమా నేపథ్యంతో, సినిమా కథతో సంబంధం లేకుండా…  సినిమా అంటే ఉన్న ప్యాషన్; తమకు అన్నం పెట్టే వృత్తి.. అని భావించి కులాలకు,మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు,వర్ణాలకు అతీతంగా ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు.

అలాంటి జీవనది లాంటి సినిమాను ప్రస్తుతం నాలుగు డబ్బులు తక్కువ వచ్చాయని బాధ ఉంటే ఉండొచ్చు గాక దానిని మరలా సమాజంలో  విద్వేషాలు రగిల్చే విధంగా కులాల పేరు జాతుల పేరు చెప్పి సినిమా పరువు తీస్తున్నారు.  వాళ్ళని వాళ్ళే వ్యక్తిగతంగా తక్కువ చేసుకుంటున్నాడు.

హైదరాబాద్ లాంటి నగరాల్లో లగ్జరీ జీవితాలు గడుపుతూ, స్టార్ హోటళ్లలో మందు తాగుతూ, ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు తిట్టిపోసే అదే… అధికార అగ్రకుల పార్టీల దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకొని.. పనులు చేస్తూ వీలైనప్పుడల్లా వేదికలెక్కి  విషం చిమ్మే వాళ్లు కూడా…  తాము ఇంకా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారమని, అణగారిన వర్గాలకు చెందిన వారమని  చెప్పుకుంటూ.. మళ్లీ ఊర్లో వాళ్లు తమను సమానంగా చూడలేదని బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఆదర్శంగా చూపించే అదే తమిళ సినిమాల్లో ఉత్తర,దక్షిణ భారత దేశాల మధ్య విభేధాలు,విద్వేషాలు…  లాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారో లోకం అందరికీ తెలుసు…

చివరగా వీళ్లు ఆదర్శంగా ఫీలయ్యే కథలు మహానుభావులే వీరికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All