Homeటాప్ స్టోరీస్అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978
palasa 1978

తెలుగు సినిమా ప్రభావం ‘రంగస్థలం‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది.

ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “పూరి జగన్నాధ్” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు.

- Advertisement -

ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకి కెమరామెన్ విన్సన్ట్ అరుళ్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు.

సినిమామకి ఇంతగా ప్రాముఖ్యత రావడానికి కారణం ఈ సినిమా ఉత్తర ఆంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో వాస్తవిక నేర నాటకం….నిజమైన పాత్రల ఆధారంగా ఈ కథ కల్పనతో మరియు దశాబ్దాల నుండి మండుతున్న సామాజిక సమస్యతో వ్రాయబడింది. మొదటి సినిమా లండన్ బాబులు తో నిరాశగా ఉన్న రక్షిత్ కి ఈ సినిమా మంచిగా ఆదాయాన్ని, మంచి పేరుని తెచ్చిపెడుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు సినిమా నిర్మాతలు, దర్శకులు.

పూరి జగన్నాధ్ గారు మనస్ఫూర్తిగా ‘పలాస 1978‘ టీం అందరిని అభినందిస్తూ ట్విట్టర్ లో ట్రైలర్ లింక్ ని పోస్ట్ చేసారు. చూద్దాం మరి సినిమా జనాలని ఎంటర్టైన్మెంట్ చేస్తుందో లేదో?

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All