Homeటాప్ స్టోరీస్నటి ని చంపేసిన భర్త

నటి ని చంపేసిన భర్త

pakisthan actress and singer reshma shot dead her husbandనటి , సింగర్ కూడా అయిన రేష్మ ని ఆమె భర్త తుపాకీ తో కాల్చి చంపేశాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన పాకిస్థాన్ లో జరిగింది . పలు చిత్రాల్లో నటించిన రేష్మ మంచి గాయని కూడా అయితే ఆమెకు ఆమె భర్త కు తీవ్ర స్థాయిలో విబేధాలు రావడంతో అతడి నుండి విడాకులు తీసుకోకుండానే దూరంగా ఉంటూ తన సోదరుడి ఇంట్లో ఉంటోంది . దాంతో ఆమెపై కోపం పెంచుకున్న రేష్మ భర్త నౌషేరా కలాన్ లోని హాకీమాబాద్ లో ఉంటున్న రేష్మ ఇంటికి వెళ్లి విచక్షణారహితంగా కాల్చి చంపాడు . కాల్పులకు తెగబడటంతో రేష్మ ఒక్కసారిగా కుప్పకూలిపోగా మిగతా కుటుంబ సభ్యులు తీవ్ర షాక్ కి గురయ్యారు .

రేష్మని కాల్చి ఆమె భర్త పారిపోగా రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసారు . తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది రేష్మ . నిందితుడు పారిపోగా అతడ్ని పట్టుకునే పనిలో ఉంది పోలీస్ యంత్రాంగం . గతంలో కూడా పలువురు సినిమా వాళ్ళ పై పాకిస్థాన్ లో హత్యలు జరిగాయి ముఖ్యంగా మహిళల పట్ల ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయి . ఈ ఏడాది లో రేష్మ హత్య తో నేరాల సంఖ్య 15 కు చేరింది .

- Advertisement -

English Title: pakisthan actress and singer reshma shot dead her husband

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All