Homeటాప్ స్టోరీస్ఊరంతా అనుకుంటున్నారు మూవీ రివ్యూ

ఊరంతా అనుకుంటున్నారు మూవీ రివ్యూ

Oorantha Anukuntunnaru Movie Review in Telugu
Oorantha Anukuntunnaru Movie Review in Telugu

ఊరంతా అనుకుంటున్నారు రివ్యూ:
నటీనటులు : శ్రీనివాస్ అవసరాల,నవీన్ విజయ కృష్ణ,సోఫీ సింగ్,మేఘా చౌదరి, రావు రమేష్,కోట శ్రీనివాస రావు,జయసుధ,
దర్శకత్వం : బాలాజీ సనల
నిర్మాత‌లు : రమ్య గోగుల,శ్రీహరి మంగళంపల్లి,పి ఎల్ ఎన్ రెడ్డి
సంగీతం : కె ఆర్ రాధాకృష్ణన్
సినిమాటోగ్రఫర్ : జి.బాబు
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2019
రేటింగ్ : 2/5

నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ విజయ్ కృష్ణ లేటెస్ట్ చిత్రం ఊరంతా అనుకుంటున్నారు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ :
పచ్చని పైర్లతో కళకళలాడుతూ ఉండే రామాపురం ఊర్లో ఒక వింత కట్టుబాటు ఉంది. ఆ ఊర్లో ఒక జంటకు పెళ్లి చేయాలంటే ఊర్లో అందరి అనుమతి తప్పనిసరి. ఈ ఊర్లో నివసించే మహేష్ (నవీన్), గౌరి (మేఘ చౌదరి)కి పెళ్లి చేయాలని ఊరంతా నిర్ణయించుకుంటారు. అయితే అప్పటికే మహేష్, మాయ (సోఫియా)ను ప్రేమిస్తాడు. గౌరీ, రామన్ అయ్యర్ (శ్రీనివాస్ అవసరాల)తో ప్రేమలో ఉంటుంది.

దీంతో తప్పని పరిస్థితుల్లో మహేష్, గౌరీ గ్రామ పెద్దలకు తమ ప్రేమ విషయం వెల్లడిస్తారు. అప్పుడు పెద్దలు తీసుకున్న నిర్ణయమేంటి? వీళ్ళకి ఎలాంటి పరీక్ష పెట్టారు? అందులో ప్రేమ జంట విజయం సాధించారా లేదా అన్నది ఈ చిత్ర కథ.

నటీనటులు :
నవీన్ విజయ్ కృష్ణ తన పాత్రకు తగ్గట్లు నటించాడు. కామెడీ సన్నివేశాల్లో కంఫర్ట్ గా కనిపించిన నవీన్, ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకున్నాడు. అన్ని వేరియేషన్స్ చూపించడానికి నవీన్ కు తగ్గ పాత్ర దొరికింది. సహజంగా మంచి నటుడైన అవసరాల శ్రీనివాస్ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించేందుకు ప్రయత్నించాడు. తమిళ్ వాసనతో కూడిన భాషతో నవ్వులు పంచాడు. మేఘ, సోఫియా తమ పాత్రలకు తగిన న్యాయం చేసారు. అయితే మరోసారి రావు రమేష్ కీలక పాత్రలో చెలరేగిపోయాడు. తనదైన మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. మిగిలిన వారంతా మామూలే.

సాంకేతిక వర్గం :
ఊరంతా అనుకుంటున్నారు, మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్నా దాన్ని డెవలప్ చేయడంలో దర్శకుడు బాలాజీ పూర్తిగా విఫలమయ్యాడు. కథకుడిగా పూర్తిగా విఫలమైన బాలాజీ, దర్శకుడిగానూ మెప్పించలేకపోయాడు. అనవసర సన్నివేశాలతో ఈ చిత్రాన్ని పూర్తిగా బోరింగ్ గా నడిపించాడు. కె ఆర్ రాధాకృష్ణన్ అందించిన పాటలు అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడా తప్పిస్తే తేలిపోయింది. ఎడిటర్ ఇంకా అనవసర సన్నివేశాల దగ్గర మొహమాటం చూపించకుండా ఉండాల్సిందే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా :
ఊరంతా అనుకుంటున్నారు.. మానవీయ కోణంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు విలువివ్వాలని చెప్పే ప్రయత్నం. కాన్సెప్ట్ బాగానే ఉన్నా స్క్రిప్ట్ దశలోనే ఈ చిత్రం ఫెయిల్ అయింది. పూర్తిగా అనాసక్తికర సన్నివేశాలతో సినిమాను నడిపించాడు దర్శకుడు. దీనివల్ల నటీనటులు ఎంత బాగా చేసినా ప్రేక్షకులు పాత్రలతో కనెక్ట్ కాలేకపోతారు. ఇలా ఆకట్టుకోలేని అంశాలు పెద్దగా లేని ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

– ఊరంతా ‘ప్లాప్’ అంటున్నారు

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All