Homeటాప్ స్టోరీస్సంప్రదాయానికి విలువలు ఇచ్చే సినిమా ఇది....

సంప్రదాయానికి విలువలు ఇచ్చే సినిమా ఇది….

Oorantha Anukuntunnaru
Oorantha Anukuntunnaru

తెలుగు సినిమాలలో ఎక్కువగా ట్రెండ్ నడిచేది మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాల హవా.. క్లాసిక్స్ మూవీస్ కి తక్కువ ఆదరణ ఉంటుంది కానీ వాటిని ఒకప్పుడు చూసేవాళ్ళు జనాలు ఇప్పుడు కాదు… మాస్ సినిమా రికార్డ్స్ బద్దలు కొడితే, క్లాస్ సినిమా 50 రోజులు ఆడిన అంత విలువ. క్లాస్-మాస్ పక్కన పెడితే సినిమాలని సినిమాలాగే చూడటం వలన ఈ మధ్య బాగా జానాదారణ పెరిగింది.

అందుకు ఉదాహరణ ‘శతమానం భవతి‘ , ‘ఫిదా’ సినిమాలు. ఇవి రెండు అస్సలు మాస్ సినిమాలు కావు కనీసం ఒక్క మాస్ పాట కూడా లేని సినిమాలు. కేవలం కుటుంబ బంధాల విలువ, ఆ బంధాలకి ఉన్న ఔన్నత్యాన్ని చాటి చెప్పే సినిమాలు. ఆ తరువాత చాలా సినిమాలు ఇదే తరహాలో వచ్చాయి కానీ హిట్ అవ్వలేదు. మళ్ళీ ఇన్నాళ్టికి అలాంటి విలువల నేపథ్యంలో రాబోతున్న సినిమా ‘ఊరంతా అనుకుంటున్నారు’.

- Advertisement -

మన సీనియర్ యాక్టర్ నరేష్ వారసుడిగా అరంగేట్రం చేసిన డాక్టర్ నవీన్ ఈ సినిమాలో హీరో. ఇంకొక కథానాయకుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఉన్నారు. రావు రమేష్, జయ సుధ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలాజీ సానల కొత్త దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కె.ఎం. రాధ కృష్ణన్ సంగీతం అందిస్తున్నారు. ఆనంద్, గోదావరి, చందమామ సినిమాలా తర్వాత రాధా కృష్ణన్ సంగీత ప్రపంచానికి దూరమయినా కూడా మళ్ళీ మనకి అలాంటి పాటలు అందిస్తున్నారు అని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తుంది.

ఇక ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా సినిమా ట్రైలర్ చూసి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘ట్రైలర్ చూడటానికి కొత్తగా వుంది. నవీన్ కి ఇంకా సినిమా మొత్తానికి నా ప్రత్యేక అభినందనలు. నేను ట్రైలర్ లో ప్రతి దృశ్యాన్ని చాలా అందంగా చూసాను’ అని అన్నారు.

అంత బాగానే ఉంది కానీ నవీన్ హీరోగా మొదటి సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమా ఘోర పరాజయం అయ్యింది. ఇప్పుడు ఈ ట్రైలర్ లో కూడా తన నటన, ఆహాభావాలు కూడా అస్సలు బాలేదు. మరి శ్రీనివాస్ అవసరాల కూడా సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో సినిమా ఒప్పుకున్నాడు అని చేప్పేశారు. నవీన్ నటన సినిమాకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All