Homeటాప్ స్టోరీస్చేతిలో సినిమాలు లేకపోతేనే కదా మాటలు చెప్పుతారు.

చేతిలో సినిమాలు లేకపోతేనే కదా మాటలు చెప్పుతారు.

చేతిలో సినిమాలు లేకపోతేనే కదా మాటలు చెప్పుతారు.
చేతిలో సినిమాలు లేకపోతేనే కదా మాటలు చెప్పుతారు.

‘చిత్రం’ సినిమా ద్వారా తెలుగులో దర్శకులుగా ఆరంగేట్రం చేసిన ‘తేజ’ గారు అందరి దర్శకుల మాదిరిగా కాకుండా కొంచెం విభిన్నంగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. దర్శకులు కాకముందు తేజ గారు కొన్ని సినిమాలకి ఛాయా గ్రాహకులుగా, అవసరమైతే చిన్న పాత్రలు కూడా చేసేవారు ఆ సినిమాలలో. ఒక సినిమాకి ఎన్ని విభాగాలు ఉంటే అన్ని విభాగాలలో పని చేసిన దర్శకుల పేరు చెబితే అందులో తేజ గారి పేరు ఉంటుంది.

ఫామిలీ సర్కస్, నువ్వు నేను, జయం, జై, నిజం, ఒక వి చిత్రం, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు తేజ ప్రతిభకి నిదర్శనాలుగా ఉంటాయి. ఆయన చేసిన సినిమాలు ఫ్లాపులుగా ఉన్నా కూడా ఆయన ప్రతిభ కనబడేది ఆ సినిమాలల్లో. అలా అందరి నుండి మంచి పేరు తెచ్చుకున్న తేజ గారు కొన్ని సినిమాల విషయంలో మంచి టాక్ రాలేదని మీడియా వారిని, జనాలని తిట్టేవారు. అలా ఒక్కసారిగా అందరిలో తేజ గారి మీద నెగటివ్ ఇంప్రెషన్ పడింది. అందుకే కొన్ని సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. చూసుకుంటే కొంత కాలం నుండి తేజ గారు మాటలు పలువురికి మంచిగా అనిపిస్తే ఎక్కువ మందికి అవి పంచులు గా వారి మీద వెటకారంగా మాట్లాడే వారు అని అనుకునేవారు. ”ఆ సరేలే సినిమాలు మంచిగా తియ్యరానప్పుడేగా ఇలాంటి మాటలు చెప్పుతారు” అని తేజ గారిని ఉద్దేశించి అనేవారు.

- Advertisement -

మొన్న చిరంజీవి గారు సెట్స్ లో అలా ఉండేవారు అని చెప్పిన తేజ గారు తమిళ దిగ్గజాలు అయిన రజినీకాంత్- కమల్ హాసన్ ల గురించి హానెస్ట్ గా తన మనసులో ఉన్న మాట చెప్పేసారు. కమల్ హాసన్ గారు సినిమాలో ఎన్ని గెట్ అప్ లు వేసినా ఆయన మాత్రమే కనిపిస్తారు, ఆ పాత్రలు కనిపించవు. అదే రజనీకాంత్ గారి సినిమాలో రెండు గెట్ అప్ లు వేసిన కూడా ఆ గెట్ అప్ లో మనకి ఆ పాత్ర కనిపిస్తుంది తప్ప రజినీకాంత్ గారు కనిపించరు అని మీడియా ముందు రజినీకాంత్-కమల్ హాసన్ ల గురించి చెప్పేసారు.

ఇంకా చెప్పుతూ నా దృష్టిలో హీరో అంటే సెట్స్ లోపల ఉండేవారు అని, తన షాట్ అయిపోగానే మనకి ఎందుకులే అని వారి వాహనం లోపలికి వెళ్లి కూర్చునే వారు కాదని అన్నారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు అలానే చేస్తారు. నేను వారితో పని చేసేటప్పుడు వారికి మిగిలిన వారికి తేడాలు గమనించాను అని అన్నారు. మొత్తానికి అలా నోరు విప్పుతూ మరొకసారి వార్తల్లో నిలిచారు తేజ గారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All