Homeటాప్ స్టోరీస్నువ్వు తోపురా రివ్యూ

నువ్వు తోపురా రివ్యూ

నువ్వు తోపురా రివ్యూ
నువ్వు తోపురా రివ్యూ

నటీనటులు : సుధాకర్ కొమాకుల , నిత్యా శెట్టి , నిరోషా
సంగీతం : సురేష్ బొబ్బిలి , దీపక్
నిర్మాత : శ్రీకాంత్
దర్శకత్వం : హరినాథ్ బాబు
రిలీజ్ డేట్ : 3 మే 2019
రేటింగ్ : 2. 5 / 5

సుధాకర్ కొమాకుల హీరోగా హరినాథ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” నువ్వు తోపురా “. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

హైదరాబాద్ గల్లీ లలో అల్లరిగా తిరిగే కుర్రాడు సూరి ( సుధాకర్ కొమాకుల ) చదువుని మధ్యలో ఆపేసి ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు . రమ్య ( నిత్యా శెట్టి )అనే అమ్మాయిని ప్రేమిస్తాడు సూరి , రమ్య కూడా సూరి ని ఇష్టపడుతుంది కానీ కొన్ని సంఘటనల వల్ల సూరి పై ద్వేషంతో అమెరికా వెళ్లిపోతుంది . రమ్య మీద కోపం తో ఉన్న సూరి కి అమెరికా వెళ్లే ఛాన్స్ వస్తుంది . అమెరికా వెళ్లిన సూరి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ? రమ్య ని కలిశాడా ? సూరి – రమ్యల కథ సుఖాంతం అయ్యిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
కథ
ఎమోషనల్ సీన్స్

డ్రా బ్యాక్స్ :
ఫస్టాఫ్
స్లో నెరేషన్

నటీనటుల ప్రతిభ :
సూరి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి , అయితే అన్నిన్నిటినీ పండించడంలో తడబడ్డాడు సుధాకర్ . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన సుధాకర్ కామెడి ని పండించాడు అలాగే తెలంగాణ యాసలో డైలాగ్స్ బాగానే చెప్పాడు కానీ ఎమోషనల్ సీన్స్ లో మరింతగా మెరుగవ్వాలి . బాలనటిగా అలరించిన నిత్యా శెట్టి హీరోయిన్ గా అలరించలేకపోయింది . ఉన్నంతలో కొంతవరకు బెటర్ కానీ తనదైన ముద్ర వేయలేకపోయింది . హీరోగా నటించిన వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు పాపం . సీనియర్ నటి నిరోషా పాత్ర ఫరవాలేదు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు రాణించారు .

సాంకేతిక వర్గం :
సురేష్ బొబ్బిలి – దీపక్ లు అందించిన పాటలు , నేపథ్య సంగీతం ఫరవాలేదు , మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు . విజువల్స్ బాగున్నాయి . నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి . ఇక దర్శకుడు విషయానికి వస్తే ……. మంచి కథ ని ఎంచుకున్నప్పటికీ దాన్ని తెరమీద చూపించడంలో మాత్రం తడబడ్డాడు . ఫస్టాఫ్ ని బోరింగ్ గా చిత్రీకరించిన దర్శకుడు సెకండాఫ్ లో జాగ్రత్త పడ్డాడు కానీ మళ్ళీ పట్టు తప్పిపోవడంతో నువ్వు తోపురా అనిపించుకోలేక పోయాడు .

ఓవరాల్ గా : ఇది తోపు సినిమా కాదు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All