Homeటాప్ స్టోరీస్మాస్ రాజా కు జోడిగా నుపుర్ సనన్

మాస్ రాజా కు జోడిగా నుపుర్ సనన్

nupur-sanon romance raviteja
nupur-sanon romance raviteja

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ రేపు ఉగాది కానుకగా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మాస్ మహారాజా జెట్ స్పీడ్ లో ఉన్నాడు. చాలామంది హీరోలు సినిమా సినిమాకు కాస్త గ్యాప్ అయినా తీసుకుంటారు కానీ రవితేజ మాత్రం ఒకేసారి సెట్స్ పైకి రెండేసి , మూడేసి సినిమాలను తీసుకెళ్లి..ప్రతి రోజు షూటింగ్ లతో గడుపుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ మధ్యనే ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రస్తుతం సెట్స్ ఫై ధమాకా , రామారావు చిత్రాలను ఉంచాడు. వీటిలో రామారావు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వంశీ దర్శకత్వంలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అనే సినిమా చేయబోతున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నుపుర్ సనన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవాజుద్దీన్ సిద్ధిఖీకి జోడీగా ‘నూరాని చెహ్రా’ మూవీ లో ఈమె హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే తెలుగు లో ఛాన్స్ రాబట్టుకోవడం విశేషం. ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నాడు. మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకోబోతున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All