
తమ అభిమాన హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది. వాళ్లేం ఏంచేస్తే దానిని అభిమానులు ఫాలో అవుతుంటారు. వాళ్ల క్యాస్ట్యూమ్స్.. వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధరపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ ధరించిన వాచ్ పేరు Patek Philippe Nautilus 5712 1/A. ఇంగ్లండ్‌కు చెందిన ఈ బ్రాండెడ్ వాచ్ ధర అక్షరాల రూ. కోటి 70 లక్షల పైమాటే. ఈ ధర తెలిసి అంత అవాక్కవుతున్నారు.
గతంలో కూడా ఎన్టీఆర్ రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ ధరించాడు. ఈ వాచ్ ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు(5,14,800 డాలర్లు) ఉంటుందట. ఈ విషయం తెలిసి నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ డబ్బుతో ఏకంగా ఇళ్లు కట్టేసుకోవచ్చు అని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. వాస్తవానికి ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఎన్టీఆర్ కి నచ్చితే చాలు.. రేటు చూడకుండా కొనేస్తారు.