Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కొడుకుని కాపాడేదెవరు

ఎన్టీఆర్ కొడుకుని కాపాడేదెవరు

ntr tweeted about his son abhayయంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ ని కాపాడేదెవరు ? ప్రతీరోజు కోటా పాలు తాగాల్సిందే , తాగకపోతే బెదిరించి మరీ ఆ కోటా కంప్లీట్ చేస్తుందట లక్ష్మీ ప్రణతి దాంతో అభయ్ ని లక్ష్మీ ప్రణతి నుండి కాపాడలేం అంటూ ట్వీట్ చేసి ఆశ్చర్యానికి గురి చేసాడు ఎన్టీఆర్ . అసలు విషయం ఏంటంటే ….. పాలు పిల్లలకు తగిన పోషకాలను అందిస్తాయి కాబట్టి ప్రతీ రోజు క్రమం తప్పకుండా పాలు తాగించేలా చేస్తుందట లక్ష్మీ ప్రణతి . సహజంగానే పిల్లలు పాలు తాగమంటే తాగకుండా మారాం చేస్తుంటారు .

అయితే వదలకుండా బెదిరించి , అదిరించి మరీ పాలు తాగేలా చేస్తుందట ! దాంతో అభయ్ భయం భయంగా పాలు తాగుతున్న పిక్ ని ట్వీట్ చేసాడు దాంతో పాటే కొటేషన్ కూడా . ఇపుడా ఫోటో షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కు కమెడియన్ వెన్నెల కిషోర్ చేసిన రీ ట్వీట్ కూడా ఆసక్తి రేపుతోంది . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్నాడు .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All