Homeగాసిప్స్చరణ్ సినిమాకు గెస్ట్ గా ఎన్టీఆర్

చరణ్ సినిమాకు గెస్ట్ గా ఎన్టీఆర్

NTR special guest for vinaya vidheya rama pre-release eventరాంచరణ్ తాజాగా వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఈ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత డివివి దానయ్య . అయితే ఈ వేడుకకు ముఖ్య అథితులు గా ఎన్టీఆర్ ని అలాగే దర్శకులు రాజమౌళి ని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది .

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ , ఎన్టీఆర్ లు నటిస్తున్న విషయం కూడా విదితమే ! కాగా ఆ చిత్రాన్ని కూడా డివివి దానయ్య నిర్మిస్తున్నాడు దాంతో చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ , రాజమౌళి రావడం పక్కా అని తెలుస్తోంది . వినయ విధేయ రామ అనే టైటిల్ పెట్టినప్పటికీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా తెరకెక్కింది . చరణ్ సరసన కైరా అద్వానీ నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు ఈ చిత్రానికి .

- Advertisement -

English Title: NTR special guest for vinaya vidheya rama pre-release event

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All