Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన బాలయ్య కూతురు

ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన బాలయ్య కూతురు

Ntr shocked with brahmani's giftయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చింది బాలయ్య బాబు పెద్ద కూతురు నారా బ్రాహ్మణి . ఎన్టీఆర్ – బ్రాహ్మణి అన్నా చెల్లెలు అన్న విషయం తెలిసిందే . అయితే ఈ రెండు కుటుంబాల మద్య అంతగా సఖ్యత లేకపోవడంతో ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నారు కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో నందమూరి కుటుంబం – నారా కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . దాంతో అన్నయ్య కు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపి షాక్ అయ్యేలా చేసింది . ఇంతకీ బ్రాహ్మణి పంపిన గిఫ్ట్ ఏంటి ? ఎన్టీఆర్ షాక్ కావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నందమూరి హరికృష్ణ కు సంబందించిన పలు ఫోటోలు బాలయ్య ఇంట్లో ఉన్నాయట ! అందులో చాలా ఫోటోలు ఎన్టీఆర్ కు పెద్దగా తెలియదు దాంతో పెద్దనాన్న చనిపోయాడు కాబట్టి ఆయనకి చెందిన పలు ఫోటోలను ఒక ఆల్బం లా చేయించి ఎన్టీఆర్ కు అందించిందట !

చెల్లెలు అపురూపంగా చేయించి ఇచ్చిన ఆల్బం ని చూసి ఎన్టీఆర్ తో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా కంటతడి పెట్టుకున్నారట . నాన్న కు సంబందించిన అరుదైన ఫోటోలను ఆల్బం గా చేయించి ఇచ్చినందుకు చెల్లలు బ్రాహ్మణి అంటే మరింత గౌరవం పెరిగిందట . రెండు కుటుంబాలు కలిసిన ఈ సందర్భంలో అరుదైన గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాడట ఎన్టీఆర్ . ఇక ఇదే పెద్ద గిఫ్ట్ అంటే అరవింద సమేత చూసాను , చాలా బాగా యాక్ట్ చేసావ్ అన్నయ్యా అని బ్రాహ్మణి అంటుంటే ఎన్టీఆర్ మరింతగా పులకరించిపోతున్నాడట .

- Advertisement -

English Title: Ntr shocked with brahmani’s gift

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All