
యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కాబోతుంది. విడుదల కు పది రోజులే ఉండడం తో రాజమౌళి ప్రమోషన్ కార్య క్రమాలను బిజీ చేసారు. ఈరోజు మంగళవారం సినిమా చిత్రీకరణ, ఇద్దరు హీరోల పాత్రలు, బడ్జెట్ విశేషాలు.. ఇలా ఎన్నో విషయాలపై రామ్‌చరణ్, రాజమౌళి , ఎన్టీఆర్ లు తమ మనసులోని మాటలు బయటపెట్టారు.
సినిమా షూటింగులో చాలా అనుభూతులు ఉన్నాయి. ప్రతీ రోజు కొత్త విషయం నేర్చుకోవడం, కొత్తగా అల్లరి చేయడం, ఆయనతో తిట్లు తినడం జరిగేంది. ఇలా షూటింగులో మరిచిపోలేని అనుభూతులు కొన్ని అని చెప్పలేం. నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏమిటంటే.. ఇంటర్వెల్ ఎపిసోడ్ నాకు బాగా నచ్చిన అంశం. రాజమౌళి దాదాపు 60 రాత్రులు షూట్ చేశారు. మీరు అప్పటి వరకు చూసిన చిత్రం ఒక ఎత్తు.. కథ మొత్తం అక్కడికి వచ్చి ఆగుతుంది. కథ చెప్పినప్పుడే నేను చాలా ఎక్సైటింగ్‌గా ఫీలయ్యాను. ఆ సీన్లను ఎలా తీస్తాడు అనే ఉత్కంఠ నాలో ఉండేది. షూటింగ్ చేస్తుంటే కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేం అని ఎన్టీఆర్ అన్నారు.